Child Sexual Abuse in UP: పదేళ్లుగా 50 మందికి పైగా బాలికలపై అత్యాచారం, యూపీలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన సీబీఐ, పెద్ద ఎత్తున సీడీలు, వీడియోలు స్వాధీనం
ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. వివరాల్లోకెళితే.. యూపీలోని రామ్‌భవన్ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి జూనియర్ ఇంజనీర్‌గా ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతను కనిపించిన పేద బాలికలకు మాయమాటలు చెప్పి (UP engineer abused 50 kids for 10 years) వారిని లోబర్చుకునే వాడు.
Lucknow, Nov 18: పదేళ్లుగా 50 మంది చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ జూనియర్ ఇంజనీర్‌ను సీబీఐ అరెస్ట్ (CBI Arrests UP Government Engineer) చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. వివరాల్లోకెళితే.. యూపీలోని రామ్‌భవన్ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి జూనియర్ ఇంజనీర్‌గా ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతను కనిపించిన పేద బాలికలకు మాయమాటలు చెప్పి (UP engineer abused 50 kids for 10 years) వారిని లోబర్చుకునే వాడు.
ఇలా పదేళ్లుగా దాదాపు 50 మందికి పైగా బాలికలపై అత్యాచారం చేశాడు. వీరిలో చాలామంది మైనర్ బాలికలే కావడం గమనార్హం. చిత్రకూట్, హామీర్పూర్, బండా ప్రాంతాల్లోని పేద మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకుని లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అంతేకాకుండా ఈ అత్యాచార ఘటనను (Child sexual abuse in UP) ఫోటోలు, వీడియోల్లో బంధించేవాడు. ఆయా వీడియోలను తన స్నేహితులకు సైతం పంపిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధిత బాలికలకు విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం ఇచ్చి లోబర్చుకునేవాడని పోలీసుల విచారణ ద్వారా తెలిసింది. ఇలా పదేళ్ల నుంచి కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే ఈ విషయం యూపీ పోలీసులకు తెలిసింది. గతంలోనే ఇతనిపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వచ్చినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించకపోవడం యూపీ పోలీసు శాఖ ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం రంగంలోకి దిగిన సీబీఐ అతని నివాసంలో సోదాలు చేపట్టి పెద్ద ఎత్తున సాక్ష్యాలను సేకరించి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున సీడీలు, వీడియోలు, మొబైల్ ఫోన్స్‌తో పాటు కొంతమంది బాలికల ఫోటోలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలికలపై ఆకృత్యానికి పాల్పడిన రామ్ భవన్‌కు కఠిన శిక్ష పడేలా చూస్తామని అధికారులు తెలిపారు. మంగళవారం అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచిన అనంతరం సీబీఐ అధికారులు వివరాలను వెల్లడించారు.