Sex Racket Busted. (Photo Credit: PTI)

Allagadda, Nov 3: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో అక్రమ వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రియుడితో రాసలీలలు (Illicit Affair in Allagadda) జరుపుతున్న భార్యను భర్తే రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాడు. ఆళ్లగడ్డ పట్టణంలోని రామలక్ష్మీకొట్టాల రెండో వీధిలో ఓ ఆటోడ్రైవర్‌ నివాసం ఉంటున్నాడు. అతనికి ఓ సామాజికవర్గం హక్కుల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడితో పరిచయం ఏర్పడింది.

అయితే తనకు రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉందని మాయమాటలు చెప్పిన అతను ఆటోడ్రైవర్‌ భార్యతో (Auto Driver Wife) సన్నిహితంగా మెలుగుతూ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిపై భర్తకు అనుమానం రావడంతో సదరు వ్యక్తిని తన ఇంటికి రావొద్దని చెప్పాడు. అయితే అతను మాత్రం ఆమె భర్తకు తెలియకుండా వస్తూ వెళ్లేవాడు.

బట్టలిప్పింది, రూ. 1.25 లక్షలు కాజేసింది, హానీ ట్రాప్‌ వలలో చిక్కుకుని మోసపోయిన గుజరాత్ వైద్యుడు, ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండగా ఇరుగుపొరుగు వారు గమనించి ఫోన్‌ చేసి చెప్పారు. భర్త వచ్చి భార్య, ప్రియుడు ఇంట్లో ఉండటం గమనించి గదికి తాళం వేసి (Husband Exposed Her Wife Illicit Affair) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితుడు చెప్పారని, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ సుబ్రమణ్యం తెలిపారు