Chardham Temples Closed: రేప‌టి నుంచి చార్ ధామ్ యాత్ర బంద్, ఆ దేవాల‌యాల‌ను ఆరు నెల‌ల పాటూ మూసివేత‌

చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయనున్నారు.

Kedarnath Temple covered with snow (Photo Credits: ANI)

Kedarnath, NOV 02: చార్‌ధామ్‌గా (Chardham) ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి (Gangothri), యుమునోత్రి, బద్రీనాథ్‌ (Badinath), కేదార్‌నాథ్ (Kedarnath) ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయనున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra) కొనసాగుతుంది. కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్‌ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు.

TGSRTC Special Buses: ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్, వాటిలో చార్జీల త‌గ్గింపు, కార్తీక మాసం సంద‌ర్భంగా ప్ర‌త్యేక స‌ర్వీసులు 

చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్‌ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్‌ ధామ్‌ను నవంబర్‌ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif