Chennai Rains: వాయుగుండం తుఫానుగా మారే అవకాశం లేదు, అయినా చెన్నైకి భారీ వర్షాల ముప్పు ఉందని తెలిపిన చెన్నై ఐఎండీ డైరెక్టర్ ఎస్ బాలచంద్రన్
ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.
Nellore, Oct 16: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించి రేపు (అక్టోబరు 17) ఉదయం పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటుతుందని పేర్కొంది.
చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తాయి. రేపటి వరకు నగరంలో IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదనంగా, చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ బాలచంద్రన్ మాట్లాడుతూ, ''ప్రస్తుత వ్యవస్థ తుఫానుగా మారే అవకాశం లేదని తెలిపారు. చెన్నై నగరం, పరిసర ప్రాంతాల్లో రెండ్రోజులుగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అతిభారీ వర్షాలు పడతాయని తొలుత ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.
Here's Statement
పరిస్థితులు తీవ్రమై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చెన్నైవ్యాప్తంగా పలుచోట్ల 10 సెం.మీ. పైన వర్షపాతం నమోదైంది. రెండ్రోజుల వర్షాలతో నగరం అతలాకుతలమైంది. 300 ప్రాంతాలు నీట మునిగాయి. పలు సబ్‌వేల్లో 3 అడుగుల మేర నీరు చేరింది.
Here's Live tracker
మంగళవారం చెన్నైతో పాటు సమీప తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ అత్యంత భారీవర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో బుధవారం కూడా రెడ్ అలర్ట్ కొనసాగనుంది.