Chennai Shocker: భూమి అమ్మిన డబ్బులు తండ్రి ఇవ్వలేదని సొంత ఇంటిపై బాంబు వేసిన కొడుకు, ముగ్గురికి తీవ్ర గాయాలు

భూమి అమ్మిన డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటిపై బాంబు దాడి చేశాడు. ఈ కేసులో ఇంటి యజమాని కుమారుడితో సహా ఇద్దరిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వేలచ్చేరిలో చోటు చేసుకుంది.

Police | Representational Image (Photo Credit: PTI)

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూమి అమ్మిన డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటిపై బాంబు దాడి చేశాడు. ఈ కేసులో ఇంటి యజమాని కుమారుడితో సహా ఇద్దరిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వేలచ్చేరిలో చోటు చేసుకుంది.వేలచ్చేరిలోని భారతీయార్‌ వీధిలో నివాసం ఉంటున్న పన్నీర్‌సెల్వం ఇటీవల తనకున్న కొద్దిపాటి భూమిని విక్రయించాడు. డబ్బులు చేతికి రాగానే ఆ మొత్తంలో రూ.3 లక్షలు ఇవ్వాలని కుమారుడు అరుణ్‌ తండ్రిని అడిగాడు.

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందరి ముందే సామూహిక అత్యాచారం, మణిపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి..

అందుకు పన్నీర్‌ సెల్వం నిరాకరించాడు. దీంతో కోపంతో అరుణ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత తన బావమరిది ప్రవీణ్‌తో కలిసి బైక్‌పై వచ్చి తన సొంత ఇంటిపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ పేలుడులో అరుణ్‌ చిన్నాన్న వెట్రివేందన్‌, సోదరి రేఖకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాంబు నిపుణులను రప్పించి విచారణ చేపట్టారు. ఇంటిలో నాటు బాంబు పేలుడు పదార్థాలు దాచి ఉంచగా వాటిని జప్తు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్‌, ప్రవీణ్‌ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.