Chhatarpur Horror: దారుణం, కూతురిపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారం, రాత్రిపూట గది తలుపు పెట్టి బలవంతంగా నోరు మూసి..

ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పరారైన ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Chhatarpur Horror: Man Rapes Daughter for 4 Years in Madhya Pradesh, Arrested

Chhatarpur, Oct 11: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో కూతురుపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారానికి (Man Rapes Daughter For 4 Years) పాల్పడ్డాడు.దీంతో ఆ యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పరారైన ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లవకుష్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి తన కుమార్తెపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విసిగిపోయిన 21 ఏళ్ల యువతి తన తల్లితో కలిసి గురువారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. కాగా, బాధిత యువతి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు.

దారుణం, టోల్ గేట్ వద్ద ఉద్యోగిని ట్రక్కుతో గుద్ది చంపిన డ్రైవర్, టోల్ గేట్ ఫీజు చెల్లించమంటే ఆపకుండా బండిని నడిపి..

భారతీయ న్యాయ సంహిత (బీఎస్‌ఎస్‌) చట్టం కింద ఆ వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. అలాగే 18 ఏళ్ల లోపు నుంచే తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు కుమార్తె ఆరోపించింది. ఈ నేపథ్యంలో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కూడా పోలీసులు అభియోగాలు మోపారు. పరారైన నిందితుడి కోసం వెతుకుతున్నారు. అతడ్ని అరెస్ట్‌ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.