IPL Auction 2025 Live

Liquor Home Delivery: మద్యం ఇకపై డోర్ డెలివరీ, కీలక నిర్ణయం తీసుకున్న ఛత్తీస్‌గఢ్‌ సర్కారు, ఒక్కో వినియోగదారుడికి 5000 ml మద్యం, ప్రతి డెలివరీకి అదనంగా రూ.120 వసూలు

వైన్ షాప్‌ల వద్ద భారీ క్యూలైన్లు ఉంటే కరోనా (Coronavirus) విజృంభించే ప్రమాదముందని భావించి.. రాష్ట్రంలో లిక్కర్ హోమ్ డెలివరీ (Liquor Home Delivery) సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించింది.

Chhattisgarh launches portal for home delivery of liquor to avoid crowding during lockdown (Photo-ANI)

Raipur, May 5: లాక్‌డౌన్‌తో (India Lockdown) మందు బాబుల కష్టాలు పెరిగిపోయాయి.. అయితే, ఈ నెల 4వ తేదీ నుంచి లాక్‌డౌన్ సడలింపుల్లో (Lockdown Relaxation) భాగంగా మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక, కొన్ని రాష్ట్రాలు దీనికి అంగీకరించకపోగా... చాలా రాష్ట్రాల్లో లిక్కర్ షాపులను ఓపెన్ చేశాయి.. కానీ, పెద్ద సంఖ్యలో తరలివస్తున్న మందుబాబులను కంట్రోల్ చేయడం మాత్రం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఢిల్లీలో మందుబాబులపై పూలవర్షం, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఆర్థిక వ్యవస్థని కాపాడేది మీరేనంటూ పూలు చల్లిన ఢిల్లీ మద్యం ప్రియుడు, వైరల్ అవుతున్న వీడియో

ఈ క్రమంలో ఛత్తీస్‌ఢ్ ప్రభుత్వం (Chhattisgarh government) కీలక నిర్ణయం తీసుకుంది. వైన్ షాప్‌ల వద్ద భారీ క్యూలైన్లు ఉంటే కరోనా (Coronavirus) విజృంభించే ప్రమాదముందని భావించి.. రాష్ట్రంలో లిక్కర్ హోమ్ డెలివరీ (Liquor Home Delivery) సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించింది.

ఈ నేపధ్యంలో ఛత్తీస్‌గఢ్‌ స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎమ్‌సీఎల్‌) (CSMCL (Chhattisgarh State Marketing Corporation Limited) ఆధ్యర్యంలో లిక్కర్‌ విక్రయాల కోసం ప్రభుత్వం ఈ వెబ్‌సైట్‌ను మందుబాబులకు అందుబాటులో ఉంచింది. లిక్కర్‌ కావాల్సిన వాళ్లు తొలుత యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌ సంఖ్యతో పాటు వినియోగదారుడి పూర్తి వివరాలను యాప్‌లో పొందుపరచాలి. అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు

అనంతరం ఫోన్‌ను వచ్చిన పాస్‌వార్డుతో యాప్‌లోకి లాగిన్‌ అ‍య్యి సమీపంలో వైన్‌ షాపులలో నచ్చిన మందును కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం డెలివరీ బాయ్‌ ద్వారా సరుకును ఇంటి వద్ద డెలివరీ చేస్తారు. దీనికి ఆన్‌లైన్‌లోనే పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది.  మందు బాబులకు జగన్ సర్కారు ఝలక్, మద్యం ధరలు మరోసారి పెంపు, మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

అలాగే ప్రతి డెలివరీకి అదనంగా రూ.120 వసూలు చేయనున్నారు. ఒక్కో వినియోగదారుడికి 5000 మిల్కీ లీటర్‌ మద్యం విక్రయించబడుతుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ యాప్‌ అందుబాటులో ఉంటుందని అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ తెలిపింది. కాగా రాష్ట్రం వ్యాప్తంగా గల గ్రీన్‌ జోన్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. మొత్తం 26 జిల్లాల్లో రాయ్‌పూర్‌, కోబ్రా తప్ప మిగతా జిల్లాలన్నీ గ్రీన్‌ జోన్లోనే ఉన్నాయి. దీంతో దాదాపు రాష్ట్ర మంతా మద్యం అమ్మకాలను ప్రభుత్వం ప్రారంభించింది.  మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. భౌతిక దూరం పాటించకుండా.. కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా వైన్స్‌ల దగ్గరకు వచ్చేస్తున్నారు. అయితే, ఇలాంటి ఇబ్బందులు లేకుండా... ఇంటి దగ్గరకే మద్యం సరఫరా చేయాలని చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.ఐతే ప్రభుత్వం నిర్ణయంపై విపక్ష బీజేపీ మండిపడుతోంది. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా ఇంటికి మద్యం సరఫరా చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది సిగ్గు చేటని విరుచుకుపడ్డారు. లిక్కర్ డోర్ డెలివరీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు .