Chhattisgarh Shocker: తప్పతాగిన డాక్టర్, చికిత్స కోసం వచ్చిన పేషెంట్ చెంపలపై పదే పదే కొడుతూ దారుణ ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఆస్పత్రి యాజమాన్యం
మద్యం మత్తులో ఉన్న డాక్టర్ చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. చికిత్స సమయంలో ఆమెను పదే పదే కొట్టడం ప్రారంభించాడు.
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కోర్బాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న డాక్టర్ చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. చికిత్స సమయంలో ఆమెను పదే పదే కొట్టడం ప్రారంభించాడు. గెర్వాని గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి తన తల్లి సుఖమతికి అర్థరాత్రి ఆరోగ్యం బాగోకపోవడంతో అంబులెన్స్‌కి కాల్ చేశాడు.
ఐతే అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని చెప్పడంతో శ్యామ్ తన తల్లిని ఆటోరిక్షాలో మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఐతే డాక్టర్ తప్పతాగి ఉండటంతో చికిత్స సమయంలో శ్యామ్ తల్లిని కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఒక్కసారిగా శ్యామ్ షాక్ అయ్యి ఎందుకలా చేస్తున్నారంటూ వైద్యుడిని ప్రశ్నించాడు. ఐతే సదరు డాక్టర్ శ్యామ్‌ని సైలెంట్‌గా ఉండు అంటూ అతని తల్లిని పదే పదే కొడుతూనే ఉన్నాడు.
Here's Video
ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం సదరు డాక్టర్‌కి షోకాజ్ నోటీసులిచ్చారు. ఈ మేరకు మెడిక్ కాలేజ్ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ మిశ్రామ్ సదరు డాక్టర్‌కి నోటీసులు ఇచ్చామని, అతను ఎందుకలా చేశాడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.