CM YS Jagan Letter Row: ఏపీ సీఎం లేఖ ప్రకంపనలు, ఎస్‌సీబీఏ తీర్మానం సరికాదని తెలిపిన అధ్యక్షుడు దుష్యంత్‌ దవే, విచారణ జరిగితే వాస్తవం అదే బయటకు వస్తుందని తెలిపిన సీనియర్ న్యాయవాది

అయితే ఈ తీర్మానాన్నిఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే (Supreme Court Bar Association president Dushyant Dave) తీవ్రంగా తప్పుపట్టారు. సైద్ధాంతికపరంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శి రోహిత్‌ పాండేకు స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా ఓ సమాచారం పంపారు.

Supreme Court Bar Association president Dushyant Dave (Photo-Twitter/ Bar & Bench)

New Delhi, Oct 19: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు ఇచ్చే తీర్పులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (Dushyant Dave) ప్రభావితం చేస్తున్నారంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని (CM YS Jagan Letter Row) ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(SCBA) తీర్మానం చేసిన సంగతి విదితమే. అయితే ఈ తీర్మానాన్నిఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే (Supreme Court Bar Association president Dushyant Dave) తీవ్రంగా తప్పుపట్టారు. సైద్ధాంతికపరంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ గౌరవ కార్యదర్శి రోహిత్‌ పాండేకు స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా ఓ సమాచారం పంపారు.

ఎస్‌సీబీఏ చేసిన తీర్మానంలో భాగస్వామిని కావడానికి తాను తిరస్కరిస్తూ వచ్చానని, తీర్మానం విషయంలో జరిగిన సంప్రదింపుల్లోనూ పాల్గొనలేదని ఆయన (Dushyant Dave) తేల్చిచెప్పారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపణల్లో నిజం ఎంత ఉందనేది మనకు ఏమీ తెలియదు. ఓసారి విచారణ జరిగితే వాస్తవం అదే బయటకు వస్తుంది. ఈ దశలో మనం విచారణను ముందుకెళ్లకుండా అడ్డుకోజాలం. ప్రస్తుతం సీఎం ఫిర్యాదును ఖండిస్తూ తీర్మానం చేయడం అపరిపక్వమే అవుతుందని ఆయన అన్నారు.

ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక వివాదాల్లో చిక్కుకుని, వాటి నుంచి అది ఇంకా నిర్దోషిత్వంతో బయటపడలేదు. పూర్తి పారదర్శకత లేని వ్యవస్థ న్యాయవ్యవస్థేనన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. తప్పు చేసిన జడ్జీలపై ఎన్నడూ చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించలేదని దుష్యంత్‌ దవే కుండబద్దలు కొట్టారు. ఈ వర్తమానంలో దుష్యంత్ దవే అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కలికోపాల్‌ ఆత్మహత్య లేఖను ప్రస్తావించారు.

న్యాయవ్యవస్థతో ఏపీ ప్రభుత్వం ఢీ, ఏపీ హైకోర్టు జడ్జీల తీర్పుల తీరుపై సీజేఐకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం

ఆయన ఆత్మహత్యకు కారణం ఇద్దరు జడ్జీలని ఆరోపణలు వచ్చాయని వాటిపై ఎలాంటి విచారణ జరగలేదని అన్నారు. దీంతో పాటు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగాయ్‌ లైంగిక వేధింపుల ఆరోపణలను కూడా ఇందులో ప్రస్తావించారు. వీటిని పరిగణలోకి తీసుకుని న్యాయవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీనియర్ న్యాయవాది అన్నారు.

 సీఎం వైయస్ జగన్ లేఖ ప్రకంపనలు, చర్యలు తీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా డిమాండ్‌, ఢిల్లీ లాయర్ ఇంటిపై ఐటీ దాడులు, 217 కోట్ల రూపాయలు స్వాధీనం

ఇక సీఎం జగన్‌ ఫిర్యాదు విషయంలోనే దుష్యంత్‌ దవే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం రాసిన లేఖ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందులోని ఆరోపణలను పరిశీలించే అవకాశమిచ్చింది. అంతేకాకుండా న్యాయమూర్తుల ప్రవర్తనపై వచ్చే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని న్యాయవ్యవస్థకు ఇచ్చిందన్న విషయాన్ని గమనించాలి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి.. మరో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు వాటిని తప్పకుండా పరిశీలించాల్సిందే. ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసే స్వతంత్ర వ్యక్తి ఆ ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందన్న విషయాన్ని సులువుగా తేల్చగలరు. ఇదంతా చాలా పారదర్శకంగా జరగాలని ఆ ఇంటర్యూలో పేర్కొన్నారు.

ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖలో ఏముంది? న్యాయవ్యవస్థపై చర్చ మరోసారి తెరపైకి, ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పలువురు ప్రముఖులు, సీజేఐ ఎస్‌ఎ బాబ్డే ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి

ఏపీ సీఎం లేఖపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India SA Bobde) సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని దీనిని పక్కన పడేస్తారని అనుకోవడం లేదని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ తన స్వీయ హస్తాల్లో మరింత బలంగా, స్వతంత్రంగా ఉండాలి. అందులో న్యాయవ్యవస్థ విఫలమైతే ప్రజాస్వామ్యం విఫలమైనట్లే. వైఎస్‌ జగన్‌ వివేకం కలిగిన రాజకీయ నేతగా, ఒక రాష్ట్ర సీఎంగా సరైన కారణాలతోనే లేఖ రాసి ఉంటారు. చాలా ఆలోచించాకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. దానిని విచారించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని ఇంటర్యూలో పేర్కొన్నారు.