West Bengal Clash: పోలీసులకు, స్థానికులకు మధ్య గొడవ, పశ్చిమబెంగాల్‌లో ఘర్షణ వాతావరణం, కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపిన పశ్చిమబెంగాల్ సర్కార్
పశ్చిమ బెంగాలోని బదురియాలో స్థానికులు రోడ్డు మీదకు రావడంతో కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రోడ్డుపైకి రాకూడని పోలీసులు హెచ్చరించారు. తమకు రేషన్ సరుకుల పంపిణీ సరిగా జరగడం లేదని అందుకే రోడ్డుపై బైఠాయించామని స్థానికులు చెప్పారు. వారిని వెంటనే అక్కడ నుంచి లేచి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో వారు పోలీసులపై తిరగబడ్డారు. ఈ కారణంగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
West Bengal, April 22: పశ్చిమ బెంగాల్లో పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ (West Bengal Clash) జరిగింది.ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పశ్చిమ బెంగాలోని బదురియాలో స్థానికులు రోడ్డు మీదకు రావడంతో కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రోడ్డుపైకి రాకూడని పోలీసులు హెచ్చరించారు. వైద్యులపై దాడిచేస్తే ఏడేళ్ల జైలు శిక్ష, నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు, రూ. 5 లక్షల జరిమానా, కొత్త ఆర్డినెన్స్ తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం
తమకు రేషన్ సరుకుల పంపిణీ సరిగా జరగడం లేదని అందుకే రోడ్డుపై బైఠాయించామని స్థానికులు చెప్పారు. వారిని వెంటనే అక్కడ నుంచి లేచి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో వారు పోలీసులపై తిరగబడ్డారు. ఈ కారణంగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం, పశ్చిమబెంగాల్ (West Bengal) లో 423 కోవిడ్ కేసులు నమోదు కాగా, వీరిలో 73 మందికి డిశ్చార్జ్ అయ్యారు. 15 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే కోవిడ్-19 పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర బృందాలపై విమర్శలు గుప్పించిన మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమబెంగాల్ సర్కార్ వెనక్కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.
Here's the video of the clash shared by ANI:
కరోనా వైరస్ పరిస్థితులను అంచనా వేసేందుకు డిప్యూట్ చేసిన కేంద్ర బృందాలకు మమతా బెనర్జీ సర్కార్ (Mamata Banerjee Govt) ఆటంకాలు కలిగిస్తోందంటూ కేంద్రం మండిపడిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి తాజా వివరణ ఇచ్చారు. ఈమేరకు ఒక లేఖను పంపారు. కాగా పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్న రెండు కేంద్ర బృందాలకు సహకరిస్తామంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన హామీని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు స్వాగతించారు.
లాక్‌డౌన్ (Coronavirus lockdown) చర్యలు అమలుపై సమీక్షించేందుకు కేంద్ర ఆరు ఐఎంసీటీఎస్‌లను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌కు పంపింది. వీటిలో రెండు టీమ్‌లు పశ్చిమబెంగాల్‌కు వెళ్లాయి. ఒక బృందం కోల్‌కతా, హౌరా, నార్త్ 24 పరగణాలు, ఈస్ట్ మిడ్నాపూర్‌లో పర్యటించగా, మరో బృందం జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్, కలింపాంగ్‌లలో పర్యటించింది. అయితే, కేంద్ర బృందాల రాకను 'అడ్వెంచర్ టూర్'గా పశ్చిమబెంగాల్ అభివర్ణించింది.
ఇన్‌ఫెక్షన్లు, హాట్‌స్పాట్‌లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎందుకు కేంద్ర బృందాలను పంపడం లేదని నిలదీసింది. కాగా, కేంద్ర బృందాలు వచ్చిన మూడు గంటల తర్వాత ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేసారని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యమైన చర్య కాదని టీఎంసీ ఎంపీలు డెరిక్ ఒబ్రెయిన్, సుదీప్ బంధోపాధ్యాయ్ విమర్శించారు.