Union Minister Prakash Javadekar Says AP and J&K are Not Comparable | (Photo Credits: ANI)

New Delhi, April 20: కరోనావైరస్ మహమ్మారిపై (Coronavirus) ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను బుధవారం కేంద్ర కేబినెట్‌ తీవ్రంగా పరిగణించింది. వైద్యులపై దాడులను నిరోధించేందుకు కొత్త ఆర్డినెన్స్‌ (Central Government New Ordinance) తీసుకురావాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. 1897 ఎపిడెమిక్‌ చట్టంలో మార్పులు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్‌ అమల్లో ఉండనుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ (Prakash Javadkar) మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు చేపడతామని, దాడులకు పాల్పడితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని, నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వైద్యులపై దాడులకు పాల్పడేవారికి రూ లక్ష నుంచి రూ ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తామని చెప్పారు. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్‌ విలువ కంటే రెండింతలు వసూలు చేస్తామని అన్నారు. ఈ నెల 29న తెరుచుకోనున్న కేదార్నాథ్ తలుపులు, 16 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి

డాక్టర్లు, వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బందికి రూ 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. 50 లక్షల మాస్క్‌లకు ఆర్డరిచ్చామని, వైద్య పరికరాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మే 3 వరకూ విధించిన లాక్‌డౌన్‌ అమలు తీరుతెన్నులను కేంద్ర మంత్రివర్గం సమీక్షించిందని చెప్పారు. లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును పర్యవేక్షించామని తెలిపారు. పాల్గాడ్ ఘటనకు మతం రంగు పూయవద్దు, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దినేష్‌ముఖ్‌ వెల్లడి

30రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పారు. దాడులు చేసిన వారి దగ్గరే నష్టపరిహారం వసూలు చేస్తామన్నారు. ఆస్పత్రి ఆస్తులు ధ్వంసం చేస్తే మార్కెట్‌ విలువకు రెట్టింపు జరిమానా వసూలు చేస్తామని చెప్పారు. వైద్యులు, ఆశావర్కర్లు, సిబ్బందికి రూ.50లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు జవదేకర్‌ తెలిపారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధానికి వివరించారు. తమకు తగిన రక్షణ కల్పిస్తేనే తాము తలపెట్టిన ఆందోళన విరమిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తనతో చెప్పిన విషయాన్ని కూడా షా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై లోతుగా చర్చించిన కేంద్ర కేబినెట్ వైద్య సిబ్బందిపై దాడి జరిపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని, ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించారు.