No Muslim arrested for Palghar lynching incident: Maharashtra Minister Anil Deshmukh (Photo Credits: IANS/ Representational Image)

Mumbai, April 22: మహారాష్ట్రలో (Maharashtra) గతవారం పాల్గాడ్‌ జిల్లాలో చోటుచేసుకున్న మూకహత్యకు (Palghar Lynching Incident) సంబంధించి ఇప్పటివరకు 101మందిని అరెస్ట్‌ చేశామని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దినేష్‌ముఖ్‌ (Maharashtra Minister Anil Deshmukh) బుధవారం తెలిపారు. ఈ హత్యపై ఈ మధ్య సోషల్ మీడియాలో (Social Media) అనేక రకాలైన వార్తలు వచ్చాయి. 640మంది కరోనాతో మృతి, ఇండియాలో 19 వేలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజులోనే 1883 కేసులు నమోదు

ముఖ్యంగా ఈ మూకహత్యను బీజేపీ నేతలు మతకల్లోలానికి చెందినదిగా ఆరోపణలు చేయటాన్ని ఆయన ఖండించారు. కరోనావైరస్‌ (Coronavirus) విస్తరిస్తున్న ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని ఆయన హితవు పలికారు.

సాధువుల హత్యకేసులో భాగంగా అరెస్ట్‌చేసిన 101 మందిలో ఒక్కరు కూడా ముస్లిం లేరని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులు ఈ మూకహత్యకు మతం రంగు పులమడం మానుకోవాలని సూచించారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేసిన విషయం విదితమే. గత వారం రాష్ట్రంలోని పాల్గాఢ్‌ జిల్లాలో చోటుచేసుకున్న మూక హత్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనపై అత్యున్నత స్థాయి అధికారులతో దర్యాప్తు జరిపిస్తున్నామని సీఎం ఉద్ధవ్ ధాకరే ఈ సందర్భంగా అమిత్‌ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 100 మందిని అరెస్టు చేశారని తెలిపారు. ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో కొంత మంది పోలీసులు కూడా అక్కడే ఉన్నారు’’అని హోం మంత్రితో పేర్కొన్నారు.

Here's the tweet on the above news by ANI:

గతవారం పాల్గాడ్‌ జిల్లాలోని దబాధి ఖన్వేల్‌ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం గుండా కారులో సూరత్‌ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు.

Tweets by Uddhav Thackeray:

ఈ ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతులను చిక్నే మహరాజ్‌ కల్పవృక్షగిరి(70), సుశీల్‌గిరి మహరాజ్‌(35), వారి డ్రైవర్‌ నీలేశ్‌ తెల్గాడే(30)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను పోలీసులు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆ గ్రామస్తులు వారిపై కూడా దాడికి తెగపడ్డారు.

ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో బాధితులకు తప్పక న్యాయం చేస్తామంటూ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన అధినేతకు విజ్ఞప్తి చేశారు.