Vir Das 'Two Indias': రెండు ఇండియాలు, ఒకటి పగటి పూట స్త్రీలను పూజించే ఇండియా. రెండు రాత్రి పూట అత్యాచారాలు చేసే ఇండియా, వీర్ దాస్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఢిల్లీ లాయర్
నేను రెండు ఇండియాల (Vir Das 'Two Indias) నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ కమెడియన్ వీర్ దాస్ (Comedian Vir Das) వాషింగ్టన్ డీసీలోని జాన్ ఎఫ్ కెనడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్స్ ఆర్ట్స్‌లో (Post Kennedy Center Monologue)మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. నేను రెండు ఇండియాల (Vir Das 'Two Indias) నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చాడు.
ఒక ఇండియాలో పగటిపూట స్త్రీలను పూజిస్తారని, మరో ఇండియాలో రాత్రి పూట అత్యాచారాలు జరుగుతాయని.. అక్కడి నుంచి తాను వచ్చాను’ అని ప్రసంగించాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో అది మరింత వివాదంగా మారింది. ఆ వీడియో మొత్తం ఆరు నిమిషాల 53 సెకన్ల నిడివి ఉంది. అందులో ఒక ఇండియాను చూసి మాత్రమే తాను గర్వపడతానని చెప్పుకొచ్చాడు.
వీర్ దాస్ (Comedian Vir Das) వీడియోపై పెద్ద ఎత్తు విమర్శలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పలువురు వీర్ దాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి చెందిన లాయర్ వివేకానంద్ గుప్తా విదేశీ గడ్డపై ఉండి స్వదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. వీర్ దాస్ వాడిన మాటలు ఆమోదయోగ్యం కాదని.. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు అందింది.
Here's Complaint received against actor-comedian Vir Das
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Congress MP Shashi Tharoor).. ఆ వీడియోకు సంబంధించి వీర్ దాస్‌పై ప్రశంసంలు కురిపించారు. అయితే అదే పార్టీకి చెందిన నేత అభిషేక్ మను సింఘ్వీతో (Abhishek Manu Singhvi) సహా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచం ముందు భారత్‌పై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. కొంత మంది వ్యక్తులు చేసే చెడును.. అందరికి వర్తించేలా మాట్లాడటాన్ని అభిషేక్ మను సింఘ్వీ తప్పుబట్టారు.
Here's Vir Das Two Indias Speech
Here's Vir Das Reply
ఈ వివాదంపై వీర్ దాస్ స్పందించారు. తాను పోస్ట్ చేసిన వీడియోలోని వ్యాఖ్యాలు దేశాన్ని అవమానించే ఉద్దేశంతో లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన వీర్ దాస్.. దేశం చాలా గొప్పదని అని పేర్కొన్నారు. రిమైండర్‌గా విభజించడమే తన ఉద్దేశ్యమని చెప్పారు. ‘ఈ వీడియో విభిన్నమైన అంశాలపై రెండు వేర్వేరు భారతదేశాల ద్వంద్వత్వం గురించి సెటైరికల్‌గా ఉంది.
ఏ దేశమైనా కాంతి-చీకటి, మంచి-చెడులను కలిగి ఉంటుంది. ఇవేమీ రహస్యం కాదు. మనం గొప్పవారమని మరచిపోకూడదని.. ఈ వీడియో మనకు విజ్ఞప్తి చేస్తుంది. మనల్ని గొప్పగా చేసే వాటిపై దృష్టి పెట్టడం ఎప్పటికీ ఆపకూడదు. మనమందరం ప్రేమించే, విశ్వసించే, గర్వించే దేశానికి చప్పట్లు కొట్టే ఒక భారీ దేశభక్తితో స్పీచ్ ముగుస్తుంది’ అని Vir Das పేర్కొన్నాడు.