 
                                                                 బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బోల్డ్ అనే విషయం అందరికీ తెలుసు ఆమె ఏ విషయాన్ని అయిన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వూలో తన (Kangana Ranaut) జీవితంలో పెళ్లి పిల్లలు గురించి కూడా నేరుగా చెప్పేసింది. నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. కంగనా తన ప్రేమ జీవితం గురించి బహిర్గతం చేసింది.
అందులో మాట్లాడుతూ..‘నేను పెళ్లి చేసుకొని, పిల్లలని కనాలని అనుకుంటున్నా. మరో ఐదేళ్లలో నన్ను ఒకరి భార్యగా, తల్లిగా చూస్తారు’ (I definitely want to be married and have babies) అంటూ తెలిపింది. ఆయనతోనే నేను పిల్లల్ని కంటాను. అంతేకాకుండా తన జీవితంలో అతనే ఓ స్పెషల్ పర్సన్ (Kangana Ranaut hints at having someone special in her life ) అని ఈ బ్యూటీ చెప్పింది. అతని పేరుని మాత్రం వెల్లడించనప్పటికీ.. త్వరలోనే అందరికీ తెలుస్తుందని ఈ కంగనా పేర్కొంది. అలాంటి వ్యక్తి జీవితంలోకి రావడం తన లక్ అని కంగనా తెలిపింది. కంగనాకి తాజాగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్న సంగతి విదితమే.
ఇక ఈ హీరోయిన్ సర్వేష్ మేవారా దర్శకత్వంలో రోనీ స్క్రూవావాలా నిర్మించిన ‘తేజస్’ షూటింగ్ పూర్తి చేయగా విడుదలకి రెడీ అవుతోంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
