Coronavirus In India: దేశంలో కరోనా కల్లోలం, 1000కు దగ్గర్లో కరోనా పాజిటివ్ కేసులు, 25కి చేరిన మృతుల సంఖ్య, దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్
దేశంలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంపై ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) వేయికు దగ్గర్లో ఉంది. నిన్న సాయంత్రానికి 870కి పైగా కేసులు నమోదుకాగా, ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 979కి చేరింది. వీరిలో 48 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు.
New Delhi, March 29: దేశంలో కరోనావైరస్ (Coronavirus In India) మూడో దశలోకి ప్రవేశిస్తునట్లగా ప్రస్తుతం నమోదవుతున్న కేసులు వెల్లడిస్తున్నాయి. దేశంలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంపై ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) వేయికు దగ్గర్లో ఉంది.
నిన్న సాయంత్రానికి 870కి పైగా కేసులు నమోదుకాగా, ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 979కి చేరింది. వీరిలో 48 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు.
భారత రక్షణ దళాలను తాకిన కరోనావైరస్, బీఎస్ఎఫ్ అధికారికి కోవిడ్ 19
867 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 86 మంది రికవరీ అయ్యారు. 25 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో (Maharashtra) అత్యధికంగా 186 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. ఆపై రెండో స్థానంలో నిలిచిన కేరళలో (Kerala) 182 మందికి వ్యాధి సోకగా, ఒకరు మరణించారు. కర్ణాటకలో 81, తెలంగాణలో 67, ఉత్తర ప్రదేశ్ లో 65, గుజరాత్ లో 55, రాజస్థాన్ లో 54, ఢిల్లీలో 49, తమిళనాడులో 42, మధ్యప్రదేశ్ లో 39, పంజాబ్ లో 38, హర్యానాలో 35, జమ్ము కశ్మీర్ లో 33 కేసులు నమోదయ్యాయి.
కరోనాను ఇండియా నుంచి తరిమికొడదాం
ఆంధ్రప్రదేశ్ లో 19, పశ్చిమ బెంగాల్ లో 18, లడ్డాక్ లో 13, బీహార్ లో 11, అండమాన్ దీవుల్లో 9, చండీగఢ్ లో 8, చత్తీస్ గఢ్ లో 7, ఉత్తరాఖండ్ లో 6, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో 3, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రికవరీల విషయంలో మహారాష్ట్ర, యూపీ, హర్యానాలు ముందున్నాయి. మహారాష్ట్రలో 25 మంది వ్యాధిగ్రస్తులు రికవరీకాగా, యూపీ, హర్యానాల్లో 11 మంది చొప్పున వ్యాధి నుంచి బయటపడ్డారు.
ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన దేశవ్యాప్త 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,000 దాటినట్లుగా తెలుస్తోంది. వారం రోజుల్లోనే దేశంలో కొత్తగా దాదాపు 800 కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా మరో 230 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్ట్రలో 186 కేసులు నమోదయ్యాయి. కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. 979 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణాలో తొలి కరోనావైరస్ మరణం
భారతదేశంలో కరోనావైరస్ "స్టేజ్ 3" లోకి (Stage 3) రాకుండా ఉండటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనావైరస్ కారణంగా ప్రపంచంలో మరణాల సంఖ్య 30,000 దాటింది, ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా చికిత్స పొందుతున్నారు.కాగా కరోనావైరస్ వ్యాప్తి మధ్య ఇటలీ చెత్త దెబ్బతిన్న దేశంగా మిగిలిపోయింది. శనివారం నాటికి, మొత్తం అంటువ్యాధులు, మరణాలు మరియు రికవరీల సంఖ్య 92,472 కు పెరిగింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం యొక్క సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్లో 121,000 కన్నా ఎక్కువగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 2,010 మంది మరణించారు.