Telangana Health Minister Etela Rajender | File Photo

Hyderabad, Mar 28: తెలంగాణలో తొలి కరోనావైరస్ మరణం (Covid-19 First Death in Telangana) నమోదైంది. ఖైరతాబాద్‌లో కరోనా వైరస్ తో ఓ వృద్ధుడు(74) మృతి చెందాడు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తి గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోగా అతని రక్త నమూనాలు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలంగాణ (Telangana) రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ (Etela Rajender) తెలిపారు. కాగా చనిపోయిన వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఆయన వెల్లడించారు.

10 నెలల చిన్నారికి కరోనావైరస్ పాజిటివ్

మృతుడి కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారు. ఈ నెల 14న మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ (Delhi) వెళ్లిన వృద్ధుడు 17న తిరిగి వచ్చారు. 20న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి అతను మృతిచెందాడు. వృద్ధుడి మృతదేహాన్ని ఆరోగ్య శాఖ సూచనల మేరకు కుటుంబ సభ్యులు సైఫాబాద్‌ పోలీసుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు తెలంగాణలో  65 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 65 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 10 మందికి నెగిటివ్‌ వచ్చిందని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణలో 10 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రెండు రోజులు పర్యవేక్షించి తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పారు.

తెలంగాణ డీఎస్పీ నిర్లక్ష్యం, కొడుకు ద్వారా తండ్రికి, వంటమనిషికి కరోనా వైరస్

నిన్న, ఇవాళ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందన్నారు. క్వారంటైన్‌ వ్యక్తులు బయట తిరిగితే పోలీసులు జైలుకు పంపుతారని హెచ్చరించారు. కాగా నాంపల్లిలో ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు కరోనా సోకింది. కుత్బుల్లాపూర్‌లో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు.

కరోనాపై నిర్లక్ష్యం, కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు

వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో గొప్ప వసతులతో కరోనా వార్డులు ఏర్పాటు చేశాం. కరోనాను కట్టడి చేసేందుకు సహకరించాలి. క్వారంటైన్‌ నుంచి తప్పించుకోవాలని చూడొద్దు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనా మందిరాలకు ప్రజలు వెళ్లకపోవడమే మంచిది. కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వలస కార్మికులకు భోజనం ఏర్పాటు చేస్తున్నాము' అని ఈటల అన్నారు.