Hyderabad, Mar 24: తెలంగాణ సర్కారు (Telangana Govt) క్వారంటైన్‌లో ఉండకుండా తప్పించుకు తిరుగుతున్నవారిపై కొరడా ఝళిపించింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్త కొత్తగూడెం (Bhadradri Kothagudem) డీఎస్పీపై, అతని కుమారునిపై కేసు నమోదు చేశారు.
కరోనా (COVID-19) నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన కొత్తగూడెం పోలీసు అధికారి (Bhadradri Kothagudem DSP) నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేసు నమోదైంది.
విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని కొత్తగూడెం డీఎస్పీ క్వారైంటన్‌లో పెట్టకుండా తీసుకెళ్లాడు. దీంతో అతనిపై 1897 అంటువ్యాధుల నిర్మూలన చట్టం కింద కేసు నమోదైంది. అయితే, లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో కొత్తగూడెం పోలీసు యంత్రాంగంలో కలవరం మొదలైంది.
లాక్‌డౌన్ పట్టని జనం, నిత్యావసరాల కోసం మార్కెట్లలో రద్దీ
డీఎస్పీతో సహా అతని కుంటుంబాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు వరంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, డీఎస్పీ కుంటుంబం ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది.
Here's the update by ANI:
Telangana Police has registered a case against a Deputy Superintendent of Police and his son who had returned from UK, for not following quarantine protocol. The DSP's son has been tested positive for #COVID19 now.
— ANI (@ANI) March 23, 2020
లాక్‌డౌన్ అంటే ఏమిటి, ఏమి చేయవచ్చు..ఏమి చేయకూడదు
కొత్తగూడెంకు చెందిన 23 ఏళ్ల యువకుడు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మార్చి 18న అతడు లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు. ఇక్కడ నుంచి కారులో కొత్తగూడెం వెళ్లినట్లు తెలుస్తోంది.బాధిత యువకుడు మార్చి 18 నుంచి 20 వరకు కొత్తగూడెంలోని తన నివాసంలోనే ఉన్నాడు. కుటుంబసభ్యులతో పాటు కొంత మంది బంధువులు, మిత్రులను కలిసినట్లు తెలుస్తోంది.
మార్చ్ 31 వరకు ఏమేమి తెరిచి ఉంటాయి
మార్చి 20న దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనాగా అనుమానించి ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించారు. తాజాగా ఆదివారం (మార్చి 22) అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇటలీ మృత్యు ఘోష, కరోనా మరణాలు 5,476
ఇదిలా ఉంటే నిబంధనలు ఉల్లఘించిన 60 మందిపై 1897 ఎపిడెమిక్ డిజీజ్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి ఇళ్లనుంని బయటికి వచ్చే వారిని ఉపేక్షించొద్దని స్పష్టం చేసింది.