Italy Coronavirus Deaths: ఇటలీ మృత్యు ఘోష, కరోనా మరణాలు 5,476, పాజిటివ్ కేసులు 60 వేలకు దగ్గరలో, ప్రపంచవ్యాప్తంగా 13 వేలకు పైగా కోవిడ్-19 మరణాలు
Italy sees 651 new coronavirus deaths, toll nears 5,546(Photo-PTI)

Rome, Mar 23: కరోనావైరస్ ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ దేశాల్లో విలయతాండవం చేస్తున్నది. ఇటలీలో ఇప్పటివరకు 5,476 మం ది మృత్యువాత (Italy Coronavirus Deaths) పడ్డారు. శనివారం ఒక్కరోజే 793 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ (Coronavirus) వెలుగులోకి వచ్చాక ఒక దేశంలో ఇంతమంది మృతి చెందడం ఇదే తొలిసారి.

ఇండియాలో 7కు చేరిన కరోనా మృతులు, 396 మందికి కోవిడ్-19 పాజిటివ్

ఇటలీలో (Italy) జనవరి 31న తొలికేసు నమోదుకాగా, నెలలోపే వైరస్‌ దేశమంతా వ్యాపించింది. పరిస్థితి చేయిదాటుతుండడంతో ఆలస్యంగా మేల్కొన్న సర్కారు (Italy Govt) ఈ నెల 10న దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించింది. అయినప్పటికీ గత రెండు రోజుల్లోనే దాదాపు 1,420 మంది మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్న ఇటలీ దేశానికి భారతదేశం (India) మాస్క్‌లు, వైద్యపరికరాలను సహాయంగా పంపించి ఆదుకుంది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో భారత్ మాస్క్‌లు, వైద్యపరికరాలు పంపించడాన్ని ఇటాలియన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్వాగతిస్తూ, ‘‘ఈ కష్టకాలంలో సహాయం చేసిన భారతదేశానికి మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అంటూ ఇటలీ విదేశాంగమంత్రిత్వశాఖ పేర్కొంది.

ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం

గతంలోనూ చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఉన్న భారతీయులను తరలించడానికి చైనా వెళ్లిన భారతీయ వైమానిక దళానికి చెందిన సి-17 ప్రత్యేక విమానంలో 15 టన్నుల మాస్క్‌లు, చేతి తొడుగులు, వైద్యపరికరాలను భారత్ పంపించింది. దక్షిణాసియా దేశాలైన భూటాన్, మాల్దీవులకు కూడా భారత్ సహకారం అందించింది. సార్క్ కొవిడ్-19 వీడియో కాన్ఫరెన్స్ లో భారత సర్కారు కరోనా అత్యవసర నిధిని ప్రకటించింది. కరోనా విపత్తు సమయంలో ఏ సార్క్ దేశానికి అయినా సహాయం అందించేందుకు భారత్ సిద్ధమని ప్రకటించింది.

అమెరికా, చైనాల మధ్య కరోనా వార్

కోవిడ్ 19 ధాటికి తట్టుకోలేక దేశాలకు దేశాలే లాక్‌డౌన్ అవుతున్నాయి, ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా కల్లోలం మాత్రం ఆగడం లేదు. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 13 వేలకు చేరింది. ఇక బాధితుల సంఖ్య మూడు లక్షలపైనే.

ఇక ఫ్రాన్స్‌లో 562 మంది మరణించగా, పారిస్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగం వైద్యుడు (67) ఒకరు కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. బ్రిటన్‌లో కరోనా ముప్పు ఉందని భావిస్తున్న 15 లక్షల మందిని మూడు నెలలపాటు బయటకు రావొద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది. స్పెయిన్‌లో తాజాగా మరణించిన 394 మందితో కలుపుకుని ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 1720కి చేరింది.

అమెరికాలో లక్షలాదిమంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. న్యూయార్క్ సిటీ జైళ్లలో 38 మందికి కరోనా వైరస్ సోకింది. అమెరికాలో ఒక్క రోజులోనే కొత్తగా ఏడువేల కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 26,574కు చేరింది. ప్రస్తుతం అమెరికాలో 32786 మంది కరోనాతో బాధపడుతున్నారు. విచిత్రమేంటంటే... ఆదివారం ఇటలీలో కంటే అమెరికాలో 40 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆదివారం కొత్తగా 114 మంది చనిపోవడంతో అమెరికాలో మృతుల సంఖ్య 416కి చేరింది.

మరోవైపు, గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాని చైనాలో ఆదివారం తొలి కేసు నమోదైంది. కొత్తగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3261కి చేరుకుంది. శ్రీలంకలో కర్ఫ్యూను ఉల్లంఘించిన 340 మందిని అరెస్ట్ చేశారు.

ఇటలీ, చైనా తర్వాత ఇరాన్‌లో అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 1,756 మంది మరణించగా, 28,603 మంది వైరస్‌ బారినపడ్డారు. ప్రజలు సహకరించకపోతే, లక్షల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రభుత్వం హెచ్చరించాల్సి వచ్చింది. ప్రజలు ఇప్పటికైనా సహకరిస్తే, మహమ్మారి అంతమయ్యే లోపు దేశంలో 12,000 మంది మరణించవచ్చని, మరో 1,20,000 మంది వైరస్‌ బారిన పడొచ్చని పేర్కొంది. స్పెయిన్‌లో ఇప్పటివరకు 1,756 మంది మరణించారు. ఈ నెల 14న ఆ దేశంలోఎమర్జెన్సీ ప్రకటించారు. అత్యవసరాలకు తప్ప ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.

ప్రస్తుతం ఇటలీలో ఉష్ణోగ్రత 12 డిగ్రీలుగా ఉంది. అదే అమెరికాలో 8 డిగ్రీలే ఉంది. అందువల్ల ఇటలీలో కంటే అమెరికాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అనుకోవచ్చు. చైనాలో ఉష్ణోగ్రత 11 డిగ్రీలుగా ఉంది. ఆ దేశం పూర్తి కంట్రోల్ చేస్తుండటంతో ఆదివారం కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఇండియాలో ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంది. ఐతే కరోనా వైరస్ 39 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా బతకగలదని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. మన దేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు రావాలంటే ఇంకో నెల పట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.