Hyderabad, Mar 25: తెలంగాణలో కరోనావైరస్‌కు (Coronavirus in Telangana) చెందిన మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్, ఆయన ఇంట్లో పనిచేసే వంటమనిషిలో కరోనా వైరస్ (Coronavirus) లక్షణాలు కనిపించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వారిద్దరూ వరంగల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంటున్నారు. డీఎస్పీకి, వంటమనిషికి ఆయన కుమారుడి ద్వారా ఈ వైరస్ సంక్రమించడం కలకలం రేపుతోంది.
కరోనాపై నిర్లక్ష్యం, కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు
ఈ డీఎస్పీ (Telangana DSP) లండన్ నుంచి వచ్చిన తన కుమారుణ్ని క్వారంటైన్‌కు పంపకుండా ఇంట్లోనే ఉంచుకోవడంతో ఆయనపై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం తొలుత డీఎస్పీతోపాటు ఆయన ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదని ప్రచారం జరగగా.. చివరికి ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లండన్‌లో ఎంఎస్ చేస్తోన్న అలీ కుమారుడు ఈ నెల 18వ తేదీన స్వస్థలానికి వచ్చారు. ఈ నెల 20న ఆయన అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతనికి వైద్య పరీక్షలను నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది.
దీనితో అతణ్ని సికంద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో డీఎస్పీ అలీ, కుటుంబ సభ్యులతో పాటు ఆయన ఇంట్లో వంటమనిషి, పనివాళ్లు, గన్‌మెన్లకు వైద్య పరీక్షలను నిర్వహించగా అలీ, వంటమనిషికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు.
లాక్‌డౌన్ అంటే ఏమిటి, ఏమి చేయవచ్చు..ఏమి చేయకూడదు
కాగా- కరోనా వైరస్ సోకిన తన కుమారుడికి డీఎస్పీ తన గన్‌మెన్లతో సేవలను చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్‌లో తరలించే సమయంలో డీఎస్పీ గన్‌మెన్లు.. ఆ యువకుడికి సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకుని వచ్చారని, ఆ సమయంలో వారు ముఖానికి మాస్క్ మాత్రమే తగిలించుకున్నారని, అతని వస్తువులను తీసుకొచ్చే సమయంలో గ్లోవ్స్ ధరించలేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీఎస్పీ చర్య పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
లాక్‌డౌన్ పట్టని జనం, నిత్యావసరాల కోసం మార్కెట్లలో రద్దీ
ఇక ఇప్పటికే పాటిజివ్‌గా తేలిన మణికొండకు చెందిన వ్యక్తి కుటుంబంలోని మహిళ(64)కు కూడా కరోనా సోకింది. రాష్ట్రంలో ఇంతకుముందే ఇద్దరికి లోకల్ కాంటాక్టు ద్వారా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. నిన్న ఒకే రోజు మొత్తంగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో కఠిన నిర్ణయాలు ప్రకటించిన సీఎం కేసీఆర్
ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశకు చేరుకోవడంతో..ప్రజలు భయపడిపోతున్నారు. లాక్ డౌన్ ప్రకటించినా..ప్రజలు సహకరించకపోవడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. నిబంధనలు పాటించాల్సిందేనంటూ...ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు భారత ప్రధాన మంత్రి 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇదే కంటిన్యూ అయితే..మూడో స్టేజీకి వెళ్లే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.