Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, March 25: స్టేట్ లాక్ డౌన్ (Telangana Lockdown) నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనావైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను ప్రజలంతా కచ్చితంగా పాటించి తీరాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ గడువు పూర్తయ్యేదాకా ఏ ఒక్కరూ గడప దాటొద్దని స్పష్టంచేశారు.

ప్రజలంతా మనవాళ్ళే మంచి పద్ధతిలో చెప్పి ముందుకు పోవాలని ప్రభుత్వం చూస్తుంది, అందుకు ప్రజలు నూటికి నూరుశాతం సహకరించాలని కోరారు. ప్రజలు నియంత్రణ పాటించకుంటే 24 గంటల కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని, అప్పటికీ వినకుంటే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు (Shoot-at-Sight Orders) ఇవ్వాల్సివస్తుందని, చేయి దాటిపోతే ఆర్మీని కూడా రంగంలోకి దింపాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్కడిదాకా పరిస్థితులు తెచ్చుకోవద్దని సీఎం సూచించారు.

Watch CM KCR Press Meet

పోలీసులు, కలెక్టర్లు మరియు అధికారులు మాత్రమే రోడ్లపైకి విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కష్టసమయంలో ప్రజాప్రతినిధులందరూ కూడా బాధ్యత తీసుకొని పోలీసులకు సహాకారం అందిస్తూ ఉండాలి అని సీఎం పేరొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ మరియు రాచకొండ పరిధిలోని ప్రజాప్రతినిధులు కార్పోరేటర్లందరూ బాధ్యత తీసుకోవాలి అని సీఎం చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గ కేంద్రాలలోనే ఉండాలి, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ తదితరులందరూ తమ మండలాలకు కథానాయకులుగా వ్యవహిరించాలి కేసీఆర్ సూచించారు.  ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన, 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్

ఇప్పటివరకు పాజిటివ్‌ వచ్చిన కేసులు 36. ఒకరు ట్రీట్‌మెంట్‌ తీసుకుని వెళ్లిపోవడంతో 35 కేసులు ఉన్నాయి. ఎవరికి కూడా ప్రమాదంలేదు. ఆక్సిజన్‌, వెంటిలేటర్లు పెట్టడంలేదు. అంతా కోలుకొంటున్నరు. ఇప్పడు ఉన్నవాళ్లు ఇంచుమించుగా ఏప్రిల్‌ 7 వరకు కోలుకొంటరు. ఈ లోగా కొత్తకేసులు రాకుంటే జీరోకు పోతాం. కాబట్టి మనకు పెద్దగా ప్రబలకపోవచ్చు. కానీ ముందుజాగ్రత్త చర్యలు మాత్రం గట్టిగా తీసుకోవాల్సిన అవసరమున్నది. 195 దేశాలకు కరోనా పాకింది. ఫారెన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చినవారు 19,313 మంది ఉన్నారు. వారందరినీ సర్వైలెన్స్‌లో పెట్టినం.

జిల్లా కలెక్టర్లు, అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లో స్ట్రిక్ట్‌గా ఆదేశాలిచ్చినం. వాళ్ల పాస్‌పోర్టులను సీజ్‌ చేయాలని చెప్పినం. అవసరమైతే పాస్‌పోర్టులు సస్పెండ్ చేస్తాం. పౌర సమాజానికి శత్రువులుగా వ్యవహరించే వారు పౌర సదుపాయాలు పొందటానికి అర్హులు కాదు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక వ్యక్తి నిర్మల్‌లో మూడుసార్లు కంటిన్యూగా తప్పించుకున్నడు. వీళ్లను కంట్రోల్‌ చేయాల్సిందే. కరోనా లక్షణాలున్న అనుమానితులు 114 మంది ఉన్నా రు. వీరిలో 82 మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లున్నరు. వీరిలో 32 మందికి సోకి ఉండవచ్చనే అనుమానమున్నది. వీళ్ల నమూనాలు పరీక్షలకు పంపించాం. బుధవారం రిపోర్టులు వస్తాయి. ఎంతమందికి పాజిటివ్‌ ఉన్నదో తెలుస్తుంది.

If Emergency Dial 100

ఏదైనా అత్యవసరమైతే డయల్ 100కు కాల్ చేయండి అని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. కొంతమందికి గుండె జబ్బు రావొచ్చు, లేదా ఎవరైనా చనిపోవచ్చు. అలాంటపుడు వారు ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సిందే కాబట్టి అలాంటి పరిస్థితులే ఉంటే డయల్ 100కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే ప్రభుత్వమే వారికి వాహనం సమకూర్చి పంపే ఏర్పాట్లు చేస్తుందని సీఎం స్పష్టం చేశారు.