Delhi Corona Deaths: దేశ రాజధానిలో కరోనా కల్లోలం, 45 రోజులు పసిపాప మృతి, 2248కి కరోనా చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, 71 కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేసిన ఢిల్లీ సర్కారు

ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22వేలకు చేరువలో ఉంది. ఇటు దేశ రాజధానిలో కోరనా (Coronavirus in Delhi) కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో 2248కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు (Delhi Corona Deaths) కోల్పోయారు. తాజాగా 45 రోజుల పసిపాపకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Delhi Corona Deaths (Photo-PTI)

Delhi,April 23: భారత్‌లో కరోనా (Coronavirus in India) శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22వేలకు చేరువలో ఉంది. ఇటు దేశ రాజధానిలో కోరనా (Coronavirus in Delhi) కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో 2248కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు (Delhi Corona Deaths) కోల్పోయారు. తాజాగా 45 రోజుల పసిపాపకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొబైల్ ఫోన్ల ద్వారా కరోనా వ్యాప్తి, ఆస్పత్రుల్లోకి మొబైల్స్ తీసుకువెళ్లవద్దు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం, విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు

ఢిల్లీలోని జామా మసీదు ఏరియాలోని 11 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ 11 మందిలో పసిపాప కూడా ఉంది. పాప కరోనాతో చనిపోయింది. అయితే పాపకు కరోనా ఎవరి నుంచి సోకిందనే విషయంపై విచారణ జరుపుతున్నామని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు.

ఢిల్లీలో గత 24 గంటల్లో 48 కేసులు (Delhi Covid-19 cases) బయటపడ్డాయి. ఘజియాబాద్ నగరంలోనూ మరో నాలుగు కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి.కరోనా కేసుల సంఖ్య ఘజియాబాద్ లో 50, నోయిడాలో 103 కు పెరిగాయి. ఢిల్లీలో నమోదైన కేసులను పరిశీలిస్తే 1,464 పాజిటివ్‌ కేసుల్లో 50 ఏళ్ల లోపు వారు ఉన్నారు. 359 కేసుల్లో 50 నుంచి 59 సంవత్సరాల వయసున్న వారున్నారు. కరోనా పేరుతో బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది, వలస కూలీలకు వెంటనే ఆహార భద్రత కల్పించండి, కీలక వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ

425 కేసుల్లో 60 ఏళ్లకు పైబడిన వారున్నారు. 60 ఏళ్ల పైబడి ఉన్న వారే కరోనాతో చనిపోయారు. ప్రస్తుతానికి ఢిల్లీలో ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి జరగలేదని సత్యేంద్ర జైన్‌ చెప్పారు. ఢిల్లీలోని ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌, ఎల్‌ఎన్‌జేపీ, సఫ్దర్‌జంగ్‌, లేడి హర్దింగే, ఎయిమ్స్‌, ఆర్‌ఎంఎల్‌, గంగరాం, మ్యాక్స్‌ సాకేత్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. వైద్యులపై దాడిచేస్తే ఏడేళ్ల జైలు శిక్ష, నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు, రూ. 5 లక్షల జరిమానా, కొత్త ఆర్డినెన్స్ తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెంది 26 మందికి కరోనా పాజిటివ్‌గా తేలారు. జ‌హంగీర్‌పురిలో నివసిస్తున్న ఒక కుటుంబంలో ఇంత పెద్ద సంఖ్య‌లో క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌టం అంద‌రినీ షాక్‌కు గురిచేస్తోంది.అయితే తొలుత ఈ కుటుంబంలో ఎవరికీ కరోనా సోకింది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రోవైపు క‌రోనాపై పోరాడి మ‌ర‌ణించిన అత్య‌వ‌స‌ర సేవ‌ల సిబ్బందికి తాజాగా కేజ్రీవాల్ భారీ న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది కరోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోతే రూ.కోటిని న‌ష్ట‌ప‌రిహారంగా అందించ‌నున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ తాజాగా ప్ర‌క‌టించారు.రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్పటికే 71 కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేశారు.క‌రోనా వేళ అంద‌రూ ఇంటిలోనే గ‌డ‌పాలని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సూచించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif