Kolkata, April 23: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనావైరస్ (West Bengal Coronavirus) నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల మీద కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, రోగులు ఆసుపత్రుల్లోకి వెళ్లక ముందే తమ మొబైల్ ఫోన్లను (Mobile Phones) బయటే అప్పగించాలని ఆదేశించింది. ఎవరూ ఆసుపత్రుల లోపలికి ఫోన్లు తీసుకువెళ్లరాదని, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో తమ మొబైల్ ఫోన్లను తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా (State Chief Secretary) ప్రకటన విడుదల చేశారు. పోలీసులకు, స్థానికులకు మధ్య గొడవ, పశ్చిమబెంగాల్‌లో ఘర్షణ వాతావరణం, కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపిన పశ్చిమబెంగాల్ సర్కార్
మొబైల్ ఫోన్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆసుపత్రుల్లో అపరిశుభ్రతతో సహా ప్రభుత్వ వైఫల్యాలు రికార్డ్ చేస్తున్నందుకే మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదని ఆరోపించాయి.
Here's ANI tweet
Novel #coronavirus spreads through mobile phones&a decision has been taken, as per WHO guidelines, to control the spread of infection. All doctors, medical staff, & patients must deposit their mobile phones outside and collect it while leaving the hospital: WB Chief Secy (22.04) pic.twitter.com/6hTMptCgPP
— ANI (@ANI) April 23, 2020
ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్ పేరుతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలనుకుంటోందని ఆరోపించాయి. కోల్‌కతా శ్మశానాల్లో 3 రోజులుగా ఏకధాటిగా శవాలను తగలబెడుతున్నారని ఇవన్నీ కరోనా మృతులవేనంటూ పశ్చిమబెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ కైలాస్ విజయవర్గీయ ఆరోపించారు.
Here's Kailash Vijayvargiya Tweet
कोलकाता के इस शवदाह मैदान में पिछले 3 दिन से लगातार शव जलाए जा रहे हैं। निश्चित रूप से कोरोना से मृत ये उन्हीं मरीजों के शव हैं, जिनकी मौत की जानकारी सरकार छुपा रही है। कोई काम चोरी-छुपे तभी होता है, जब कुछ गलत हो!@MamataOfficial जी, ये अमानवीय कृत्य आपको बहुत भारी पड़ेगा। pic.twitter.com/czBxVs0and
— Kailash Vijayvargiya (@KailashOnline) April 22, 2020
ట్వీటర్‌లో వేదికగా ఓ వీడియోని విడుదల చేశారు. పశ్చిమబెంగాల్‌లో ఇప్పటివరకూ 423 మందికి కరోనా సోకింది. 15 మంది చనిపోయారు.