Coronavirus In India: కాటేస్తున్న కరోనా, ఆరు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ మెసేజ్, ఇండియాలో 29కి చేరిన కరోనా కేసులు, సిక్కింలోకి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించిన సిక్కిం సర్కారు

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం (Central Government) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ (Union Health Minister Harsh Vardhan) ఆదేశాలు జారీ చేశారు.

Coronavirus Spread (Photo Credit: IANS)

New Delhi, Mar 06: చైనాలోని వుహాన్ నగరంలో (Wuhan In China) పుట్టిన కరోనా వైరస్ (Coronavirus) మన దేశానికి కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం (Central Government) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ (Union Health Minister Harsh Vardhan) ఆదేశాలు జారీ చేశారు.

కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాగా దేశంలో కరోనా వైరస్ (Coronavirus in India) బాధితుల సంఖ్య 29కి చేరింది. ఆగ్రా నగరానికి చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబం కరోనా బాధితుడితో కలిసి ఉంది. దీంతో ఆ కుటుంబానికి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కరోనా వైరస్ సోకుతున్న నేపథ్యంలో చైనా దేశ సరిహద్దుల్లోని సిక్కింలోకి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ సిక్కిం సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. సిక్కింలోని గ్యాంగ్‌టక్, డార్టిలింగ్, నాథులా ప్రాంతాల్లోని హోటళ్లలో విదేశీ పర్యాటకుల బుకింగ్స్ ను సిక్కిం సర్కారు రద్దు చేసింది.

COVID-19 India Confirmed Cases

కరోనా వైరస్ భయంతో విదేశీ పర్యాటకులను సిక్కింలోకి అనుమతించవద్దని సర్కారు టూర్ ఆపరేటర్లను ఆదేశించింది. చైనా దేశంలోనే కరోనా వైరస్ ఉద్భవించిన నేపథ్యంలో ఆ దేశ సరిహద్దుల్లో నాథులా ప్రాంతంలో పర్యాటకుల సందర్శనకు పర్మిట్ల జారీని నిషేధించింది.

హోళీ మిలన్‌కు దూరంగా అగ్రనేతలు

సిక్కిం, డార్జిలింగ్ ప్రాంతాల్లో విదేశీ పర్యాటకులు 7 రోజుల పర్యటనకు వస్తుంటారని, కరోనా భయం వల్ల వారిని అనుమతించవద్దని క్లబ్ సైడ్ టూర్స్ అండ్ ట్రావెల్ యజమాని అమిత్ పెరివాల్ చెప్పారు. ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమెరికన్లు, ఫ్రెంచ్, జర్మన్లు, జపనీయులు, చైనీయులు పెద్ద సంఖ్యలో సిక్కింలో పర్యటిస్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో సిక్కిం సర్కారు నిషేధ నిర్ణయంతో విదేశీ సందర్శకుల పర్యటనలు రద్దు అయ్యాయి.