India Coronavirus: లాక్‌డౌన్ దెబ్బ..ఉద్యోగులకు అనేక రకాల అనారోగ్య సమస్యలు, దేశంలో తాజాగా 9,110 మందికి కోవిడ్ వైరస్, 1,08,47,304కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 9,110 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. అదే స‌మ‌యంలో 14,016 మంది కోలుకున్నారు.

Coronavirus outbreak in India (Photo Credits: IANS)

New Delhi, Feb 9: దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 9,110 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. అదే స‌మ‌యంలో 14,016 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,47,304కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,158 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,48,521 మంది కోలుకున్నారు. 1,43,625 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు,హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 62,59,008 మందికి వ్యాక్సిన్ వేశారు.దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,25,87,752 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,87,138 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే సౌలభ్యాన్ని కల్పించాయి. తొలుత ఇదేదో బాగుందని సంబరపడినవారు ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లి పనిచేయడమే బాగు అని భావిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల శారీరక, మానసిక అనారోగ్యాలు చుట్టుముట్టడమే ఇందుకు కారణమని హర్మన్ మిల్లర్ అనే ఆఫీస్ ఫర్నిచర్ తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది.

రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్ధతు, అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం, కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేసిన ప్రధాని మోదీ, డేట్ చెబితే చర్చలకు వస్తామని తెలిపిన రైతు సంఘాల నాయకులు

ఈ సంస్థ సర్వే ప్రకారం.. ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగులు 20 శాతం ఎక్కువ సమయం కూర్చుని పనిచేస్తున్నారు. ఫలితంగా 90 శాతం మంది నొప్పులు వంటి శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, మానసిక ఒత్తిడి కూడా వారిపై విపరీతంగా పెరుగుతోంది. వీరిలో 39.40 శాతం మందికి మెడనొప్పి, 53.13 శాతం మందికి నడుమునొప్పి, 44.28 శాతం మందికి నిద్రలేమి, 34.53 శాతం మందికి చేతులు, 33.83 శాతం మందికి కాళ్ల నొప్పులు, 27.26 శాతం మందిలో తలనొప్పి, కళ్లు లాగడం వంటి సమస్యలు ఉన్నట్టు సర్వేలో తేలింది.

కరోనా వ్యాప్తి పురుషులలో అధికంగా ఉండగా, కరోనా నుంచి అప్రమత్తత పాటించే విషయంలో మహిళలు ముందుంటున్నట్లు కనిపిస్తోంది. కరోనా టీకాలు తీసుకోవడంలోనూ మహిళలు ముందున్నారు. దేశంలో ఇప్పటివరకూ 55 లక్షలకు మించిన జనాభాకు కరోనా టీకాలు వేయగా, వారిలో 63 శాతం మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉన్నారు. దేశంలో పురుషులతో పోలిస్తే టీకాలు తీసుకున్నవారిలో మహిళలే అధికంగా ఉన్నారు. కాగా దేశంలో 21 రోజుల్లో 50 లక్షల మందికి టీకాలు వేసి, సరికొత్త రికార్డు నెలకొల్పారు. సోమవారం ఒక్కరోజు దేశంలో ఆరు లక్షలకుమించిన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా టీకాలు వేశారు. అమెరికా, బ్రిటన్‌లలో 46 రోజులలో 40 లక్షల మందికి టీకాలు వేశారు.



సంబంధిత వార్తలు

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌

Rozgar Mela: రోజ్‌గార్ మేళా, 71 వేల మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ, ఏడాదిన్న‌ర‌లో 10 ల‌క్ష‌ల ప‌ర్మ‌నెంట్ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌