Farmers Protest: రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్ధతు, అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం, కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేసిన ప్రధాని మోదీ, డేట్ చెబితే చర్చలకు వస్తామని తెలిపిన రైతు సంఘాల నాయకులు
Farmers Protest in Burari Ground. (Photo Credits: ANI | Twitter)

New Delhi, Feb 8: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత రెండు నెలల నుంచి ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాలు అమల్లోకి వస్తే.. కనీస మద్దతు ధరను పూర్తిగా ఎత్తివేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో 11 సార్లు చర్చలు జరిపినా దీనిపై ఎటువంటి ఏకాభిప్రాయం రాలేదు. మరోవైపు రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

రైతు ఉద్యమంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుందని (MSP will continue) ఇప్పటికైనా కేంద్ర నాయకులు చర్చలకు వచ్చి.. వ్యవసాయ చట్టాలపై నేలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. ఇక సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అనేది గతంలో ఉంది.. ఇప్పుడు ఉంది.. ఇక మీదట కూడా కొనసాగుతుంది. పేదలకు తక్కువ ధరకు అందించే రేషన్‌ ఇక మీదట కూడా కొనసాగుతుంది. మండీలను ఆధునీకరిస్తాము. మన వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు. ఆందోళన ఏం లేదు. ఈ వేదిక ద్వారా వారిని మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నాను’’ అన్నారు.

సూప‌ర్ బౌల్‌లో మన దేశ రైతుల ఆందోళన యాడ్, మార్టిన్ లూథ‌ర్ కింగ్ జూనియ‌ర్ మాటలతో 30 సెక‌న్ల యాడ్, చరిత్రలో సుదీర్ఘ పోరాటమంటూ ప్రారంభం, నిధులు సమకూర్చిన సెంట్రల్ వ్యాలీ సిక్కు సంఘం

ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులు ప్రధాని వ్యాఖ్యలపై (After PM Modi's invite) స్పందించారు. చర్చలకు తాము సిద్ధమని.. డేట్‌, టైం ఫిక్స్‌ చేయాల్సిందిగా తెలిపారు. రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సామ్యుక్తా కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు, రైతు నాయకుడు శివ కుమార్ కక్కా మాట్లాడుతూ.. ‘‘ప్రధాని వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. చర్చలకు మేం వ్యతిరేకం కాదు.. అలానే ఎన్నడు వెనకడుగు వేయలేదు. కేంద్ర మంత్రులతో మాట్లాడటానికి మేం సిద్ధంగా (farmer leaders say ready for talks) ఉన్నాం. సరైన పద్దతిలో వారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తే.. వెళ్లడానికి తయారుగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఓ డేట్‌, టైం ఫిక్స్‌ చేసి మమ్మల్ని ఆహ్వానిస్తే.. వారితో చర్చిస్తాం’’ అన్నారు.

రైతుల ఉద్యమంలో విద్రోహక శక్తులు కూడా ఉన్నాయని మోదీ మరోసారి ఆరోపించారు. దేశంలోకి ప్రస్తుతం ఆందోళన్‌ జీవి అనే కొత్త రకం వైరస్‌ ప్రవేశించింది. అది దేశంలో ఎక్కడైనా విద్యార్థులు, లాయర్లు, కార్మికులు ఆందోళన చేపడుతున్నారని తెలిస్తే చాలు.. అక్కడికి వెళ్లి దాన్ని మరి కాస్త పెద్దది చేసే ప్రయత్నం చేస్తుంది. ఆందోళన అనేది వారి జీవితాల్లో ఓ భాగం అయ్యింది. అలాంటి వారిని గుర్తించి.. వారి బారి నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’’ అన్నారు. మోదీ చేసిన ‘ఆందోళన్‌ జీవి’ వ్యాఖ్యలపై కక్కా మండిపడ్డారు. సాధారణ రైతుల చేస్తోన్న ఉద్యమం గురించి ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.

పాకిస్తాన్ - ఖ‌లీస్తాన్ ట్విట్ట‌ర్ ఖా‌తాలను బ్లాక్ చేయండి, ట్విట్టర్‌కు నోటీసులు పంపిన కేంద్ర ప్రభుత్వం, 1,178 అకౌంట్ల నుంచి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రెచ్చ‌గొట్టే ట్వీట్లు వస్తున్నాయంటూ ఆగ్రహం

ఇదిలా ఉంటే సిక్కులపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. వారు దేశానికి ఎంతో సేవ చేశారని.. దేశం వారి త్యాగాలను ఎన్నటికి మరవదన్నారు. కానీ కొన్ని అసాంఘిక శక్తులు వారిని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాయని మోదీ ఆరోపించారు.

ఇదిలా ఉంటే వ్యవసాయ చట్టాలపై కేంద్రం సడన్‌గా ఇలాంటి ప్రకటన చేయడంతో విపక్షాలు యూటర్న్‌ తీసుకోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించాయి. అందుకు ప్రధాని మోదీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన కోటేన్‌ని ఒకదాన్ని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఈ నూతన చట్టాలను 12-18 నెలల పాటు అమలు నిలిపివేసేందుకు ముందుకు వచ్చినప్పటికి అన్నదాతలు ఒప్పుకోలేదు. ఇక తాజాగా సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని.. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని. ఇళ్లకు వెళ్లబోమని రైతులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.