California, February 8: భారతదేశంలో నవంబర్ నుండి కొనసాగుతున్న రైతుల నిరసనలు ఏకంగా అమెరికా కాలిఫోర్నియాలో మారుమోగాయి. అమెరికాలో ప్రముఖ స్పోర్టింగ్ ఈవెంట్ అయిన సూపర్ బౌల్‌లో (Super Bowl 2021) ఈ యాడ్ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సూపర్ ఈవెంట్‌ను చూడటానికి సుమారు 10 కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. ఇందులో యాడ్ ఇవ్వాలంటే కనీసం రూ.36 కోట్ల నుంచి రూ.44 కోట్లు ఖర్చవుతుంది. అలాంటి ఈవెంట్‌లో రైతులకు సంబంధించిన యాడ్ కనిపించడం గమనార్హం. అయితే ఈ యాడ్ కేవలం కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రసారమైనట్లు వార్తలు వస్తున్నాయి.
సూపర్ బౌల్ ఈవెంట్ అంటే ఎన్ఎఫ్ఎల్ యొక్క ఛాంపియన్షిప్ గేమ్.ఈ సూపర్ బౌల్‌లోనే రైతుల ఆందోళనలకు (Farmers Protest In India) సంబంధించిన యాడ్ రావడంతో ఇది మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయంశమైంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలతో మొదలైన ఈ 30 సెకన్ల యాడ్ చరిత్రలో సుదీర్ఘమైన పోరాటంగా (Biggest Protest In History) చెప్పుకున్నది. ఈ యాడ్ ఇవ్వడానికి వాలీ సిక్ కమ్యూనిటీ నిధులు సమకూర్చడం విశేషం. ఈ యాడ్ అమెరికాలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా ఎయిర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
రైతు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు మరియు రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల బిల్లును సెప్టెంబర్ 20 న భారత పార్లమెంటులో ఆమోదించారు. ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) బిల్లును ఆమోదించింది సెప్టెంబర్ 22 న రాజ్యసభలో ఇది ఆమోదం పొందింది. ఈ మూడు బిల్లులకు సెప్టెంబర్ 27 న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ అనుమతి లభించింది.
Here's AD
Here’s the Super Bowl ad featuring the Farmers Protest
If you haven’t heard about it yet, now is the time to learn. It’s an issue of injustice that affects all of us. pic.twitter.com/a0WRjIAzqF
— Simran Jeet Singh (@simran) February 7, 2021
కాగా పాప్ సింగర్ రిహన్నతో సహా నిరసనకు అంతర్జాతీయ మద్దతు లభిస్తుందని ఈ వీడియో దృష్టిని ఆకర్షిస్తుంది. నిరసన సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, నిరసనను కవర్ చేసే జర్నలిస్టులను అరెస్టు చేశారని, ఇంటర్నెట్ సదుపాయం నిలిపివేయబడిందని, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయనే విషయాన్ని ఇది హైలైట్ చేస్తుంది.
కాగా భారతదేశంలో రైతుల నిరసనల గురించి అవగాహన పెంచడానికి ఈ ప్రకటనకు సెంట్రల్ వ్యాలీ సిక్కు సంఘం నిధులు సమకూర్చినట్లు యువర్ సెంట్రల్ వ్యాలీ వెబ్‌సైట్ తెలిపింది. కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీలో సిక్కు జనాభా చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారు.