Coronavirus in India: ఉగాది శుభవార్త, కరోనాపై ఇండియా ఘనవిజయం, 48 మంది పేషెంట్లు రికవరీ, మొత్తం కేసులు సంఖ్య 519, లాక్‌డౌన్‌తో తగ్గు ముఖం పడుతున్న కేసులు

ఈ నేపథ్యంలోనే కరోనా (COVID-19) భారీన పడిన పేషంట్లు రికవరీ అవుతున్నారనే శుభవార్త ఉగాది (Ugadi) సంధర్భంగా వినిపించింది నియంత్రణతో పాటుగా పేషంట్లను మాములు స్థితికి (Covid-19 Patients Recovered) తీసుకువచ్చే విషయంలో ఇండియా ఓ అడుగు ముందుకేసిందని చెప్పవచ్చు.

Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi, March 25: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) పంజా విసురుతున్న నేపథ్యంలో దాన్ని నియంత్రణకు ఇండియా (India) గట్టి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కరోనా (COVID-19) భారీన పడిన పేషంట్లు రికవరీ అవుతున్నారనే శుభవార్త ఉగాది (Ugadi) సంధర్భంగా వినిపించింది నియంత్రణతో పాటుగా పేషంట్లను మాములు స్థితికి (Covid-19 Patients Recovered) తీసుకువచ్చే విషయంలో ఇండియా ఓ అడుగు ముందుకేసిందని చెప్పవచ్చు.

21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన 519 కరోనావైరస్ కేసుల్లో 48 మంది రోగులకు విజయవంతంగా చికిత్స అందించారు. ఇందులో రెండు వారాల క్రితం కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన మహారాష్ట్రకు చెందిన ఇద్దరు రోగులు ఉన్నారు. ఈ రోజు వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయనున్నారు. రాష్ట్రంలోని కరోనావైరస్ నుండి కోలుకున్న మొదటి రెండు కేసులు ఇవి.

లాక్‌డౌన్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు

కాగా మహారాష్ట్రలో మంగళవారం మొత్తం ఎనిమిది మంది కరోనావైరస్ రోగులు విజయవంతంగా చికిత్సను ముగించుకుని మాములు స్థితికి చేరుకున్నారు. కరోనావైరస్ కు వైద్యులు చికిత్స చేయడంతో ఇద్దరు వ్యక్తులు కేంద్ర భూభాగమైన లడఖ్‌లోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే హర్యానాలో పాజిటివ్ వచ్చిన 11 మంది కోలుకున్నారు. ఇక ఢిల్లీలో ఆరుగురికి విజయవంతంగా చికిత్స అందించారు. రికవరీల సంఖ్య కర్ణాటక మరియు కేరళలో వరుసగా మూడు మరియు నాలుగు. రాజస్థాన్లో ముగ్గురు కరోనావైరస్ రోగులకు కూడా విజయవంతంగా చికిత్స చేశారు.

తెలంగాణలో 36కు పెరిగిన కరోనాపాజిటివ్ కేసులు

తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కటి రికవరీ కేసుగా నమోదు అయ్యింది. రికవరీల సంఖ్య పెరుగుదలతో పాటు, తాజా కేసులలో కూడా తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు రోజు 99 కేసులు నమోదు కాగా మంగళవారం 64 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే గత రాత్రి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దీని ప్రకారం భారతదేశంలో అవసరమైన సేవలను మినహాయించి అన్నిటినీ నిలిపివేశారు.

తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం చేటు చేసుకుంది. మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో బాధపడుత్ను 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సీ విజయ్‌భాస్కర్‌ తెలిపారు. ఆ వ్యక్తి రక్తపోటుతో పాటు మధుమేహంతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు.

కరోనా లక్షణాలు ఉన్నమరో ముగ్గురిని గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచామని ఆయన వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. కాగా, ఇప్పటివరకు దేశంలో 519 కరోనా పాజటివ్‌ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది.