Coronavirus Outbreak in India: 35 వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా రెడ్, ఆరెంజ్ జోన్లను ప్రకటించిన కేంద్రం, దేశ వ్యాప్తంగా తగ్గిన రెడ్ జోన్ల సంఖ్య

గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,993 కరోనా కేసులు (Coronavirus cases in India) నమోదయ్యాయి. భారత్‌లో ఒక రోజు వ్యవధిలో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అధికం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,043కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శుక్రవారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, May 1: భారత్‌లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,993 కరోనా కేసులు (Coronavirus cases in India) నమోదయ్యాయి. భారత్‌లో ఒక రోజు వ్యవధిలో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అధికం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,043కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శుక్రవారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది. మే దినోత్సవం, కరోనా దెబ్బకు ప్రమాదకరంగా మారిన కార్మికుల ఉపాధి, పది కోట్ల మంది దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన

ఇప్పటివరకు 8,889 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1147 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 25,007 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 10,498 కరోనా కేసులు నమోదు కాగా, 459 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 4,395, ఢిల్లీలో 3,515, మధ్యప్రదేశ్‌లో 2,660, రాజస్తాన్‌లో 2,584, తమిళనాడులో 2,323, ఉత్తరప్రదేశ్‌లో 2,203 కరోనా కేసులు నమోదయ్యాయి.

కోవిడ్‌–19 కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే కాలం లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి ముందు 3.4 రోజులుండగా, ప్రస్తుతం 11 రోజులుగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, ప్రస్తుతం కేసులతో పోలిస్తే మరణాల శాతం 3.2గా ఉందని పేర్కొంది. కోలుకుంటున్నవారి శాతం కూడా గత రెండువారాల్లో గణనీయంగా పెరిగిందని, ఆ శాతం రెండు వారాల క్రితం 13.06 ఉండగా, ప్రస్తుతం 25కి పైగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివరించారు. మొత్తం కేసుల్లో 8,324 మంది, అంటే 25.19% కోవిడ్‌–19 నుంచి కోలుకున్నారన్నారు.  సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును ఆపలేం, స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, భూవినియోగం మార్పు నోటిపికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

ఢిల్లీ, యూపీ, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, తమిళనాడుల్లో కేసులు రెట్టింపయ్యే సమయం 11 నుంచి 20 రోజులుగా ఉందని, కర్ణాటక, లద్ధాఖ్, హరియాణా, ఉత్తరాఖండ్, కేరళల్లో అది 20 నుంచి 40 రోజులుగా ఉందని వెల్లడించారు. కోవిడ్‌తో మరణించిన వారిలో 65% పురుషులని, 35% స్త్రీలని తెలిపారు.

వయస్సులవారీగా మరణాలను గణిస్తే.. మృతుల్లో 45 ఏళ్లలోపు వయసున్న వారు 14%, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్నవారు 34.8%, 60 ఏళ్ల పైబడిన వారు 51.2% ఉన్నారని వివరించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే కేసులు రెట్టింపు అయ్యే సమయం భారత్‌లోనే ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర ఆరోగ్య‌శాఖ ఇవాళ కొత్త జాబితాను రిలీజ్ చేసింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ప్రీతి స‌ద‌న్ ఈ వివ‌రాల‌ను తెలిపారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఆమె దీనికి సంబంధించి లేఖ‌లు రాశారు. తాజా జాబితా ప్ర‌కారం 130 జిల్లాలు రెడ్ జోన్‌లో, 284 ఆరెంజ్ జోన్, 319 గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. తెలంగాణ‌లో ఆరు రెడ్ జోన్లు, 18 ఆరెంజ్ జోన్లు, 9 గ్రీన్ జోన్లు ఉన్నాయి. రెడ్‌ జోన్‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు క‌ఠినంగా ఉంటాయి.

దేశ‌వ్యాప్తంగా రెడ్ జోన్ల సంఖ్య త‌గ్గింది. గ‌త 15 రోజుల్లో ఆ సంఖ్య 23 శాతం త‌గ్గిన‌ట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీన 170గా ఉన్న రెడ్ జోన్ల సంఖ్య‌.. ఏప్రిల్ 30వ తేదీకి 130కి చేరుకున్న‌ది. ఎటువంటి కొత్త కోవిడ్ కేసులు లేని గ్రీన్ జోన్ల సంఖ్య కూడా 356 నుంచి 319కి త‌గ్గింది. అంటే వైర‌స్ కొత్త ప్రాంతాల‌కు విస్త‌రిస్తున్న‌ట్లు అధికారులు ఓ అంచ‌నాకు వ‌చ్చారు. అయితే ఆరెంజ్ జోన్లు మాత్రం పెరిగాయి. 207 నుంచి 284 వ‌ర‌కు ఆ జిల్లాల సంఖ్య పెరిగింది. రెడ్‌,ఆరెంజ్ జోన్ల‌లో కంటైన్మెంట్ చ‌ర్య‌లు ప‌టిష్టంగా ఉండాల‌న్న‌ట్లు ప్ర‌భుత్వం త‌న లేఖ‌లో పేర్కొన్న‌ది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif