May Day: మే దినోత్సవం, కరోనా దెబ్బకు ప్రమాదకరంగా మారిన కార్మికుల ఉపాధి, పది కోట్ల మంది దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన
Labourers | Representational Image | Photo Credit: ANI)

Mumbai, May 1: పెట్టుబడిదారి వ్యవస్థపై బడుగు కార్మికుడు పిడికిలి ఎత్తిన ధైర్యం. దోపిడీ దారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కార్మికులకు స్పూర్తినిచ్చిన క్షణం. హక్కుల కోసం రోడ్డెక్కి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల సంస్మరణ దినం. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే..పెట్టుబడిదారి, దోపిడివర్గాల అక్రమాలకు శ్రమ దోపిడికి గురైన కార్మికులు 1886మే1 అమెరికాలోని చికాగోలో 18 గంటల పనివిధానం వ్యతిరేకిస్తూ 8 గంటల పనివిధాన పద్ధతి ప్రవేశపెట్టాలని కోరుతూ పోరాటానికి దిగారు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో కార్మికులు మే దినోత్సవం (May Day) ఘనంగా జరుపుతున్నారు.

కార్మికులకు ( Labours) ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలా మంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. వారి రక్త తర్పణం ప్రపంచానికే కొత్త దిశను చూపింది. ఆ ఘటన తర్వాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును ఆపలేం, స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, భూవినియోగం మార్పు నోటిపికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. తామూ మనుషులమేనని, తమ శక్తికి కూడా పరిమితులుంటాయని కార్మికులు నినదించారు. పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడారు. 24 గంటల్లో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు రీక్రియేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా కార్మికులు సాధించుకున్నారు. అలా.. మే 1ని (May Day 2020) కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. 45 రోజులు శిశువు కరోనాని జయించింది, దేశ చరిత్రలోనే ఇది తొలికేసు, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జి

1923లో తొలిసారి ఇండియాలో ‘మే డే’ను పాటిస్తున్నాం. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పాటుతో కార్మికవర్గంలో చైతన్యం పెరుగుతూ వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా దేశాల్లో ఈ రోజున సెలవు దినంగా పాటిస్తున్నారు. మన దేశంలోనూ సెలవు దినంగా పాటిస్తున్నారు. అయితే.. కరోనా (Coronavirus) దెబ్బకు మే డేను జరుపుకోలేకుండా పోతున్నాం. అంతేేనా.. ఈ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలై కార్మికుడి ఉపాధి ప్రమాదకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. కరోనా ఎఫెక్ట్, నలుగురు మంత్రులు క్వారంటైన్‌లోకి , కర్ణాటకలో జర్నలిస్టుకి కోవిడ్-19, ఇప్పటికే స్వీయ నిర్భంధంలో గుజరాత్ సీఎం విజయ్ రూపాని

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మురికి వాడల్లో నివసిస్తోన్న ప్రజల్లో దాదాపు పది కోట్ల మంది కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్‌ (World bank) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే రక్షిత మంచినీరు, సరైన మురికి పారుదల వ్యవస్థ లేకుండా అనారోగ్యానికి గురవుతున్న వారి పరిస్థితి మరింత దుర్భరం అవుతుందని ప్రపంచ బ్యాంక్‌కు చెందిన పట్టణ పరిస్థితులపై అవగాహన కలిగిన నిపుణులు హెచ్చరించారు.

కరోనా వైరస్‌ ప్రభావం వల్ల మురికి వాడల నుంచి వచ్చే పన్ను వసూళ్లు కూడా 15 నుంచి 25 శాతానికి పడి పోతాయి కనుక ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం పట్టణ కార్పొరేషన్లకు ఉండే అవకాశం కూడా లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది కోట్ల మందికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆహారం, ఆర్థిక సహాయం అందడం లేదని ప్రముఖ సామాజిక కార్యకర్త శీలా పటేల్‌ తెలియజేశారు.

మురికి వాడల్లో నివసించే నిరాశ్రుయుడివైనా లేదా ఫుట్‌పాత్‌లపై పడుకునే వ్యక్తయినా వలస కార్మికుడివి అయితే చాలు ఎలాంటి రేషన్‌ లేదా ఆర్థిక సహాయం అందడం లేదని భారత మానవ హక్కుల సంఘానికి చెందిన శీలా పటేల్‌ ఆరోపించారు. పలు ప్రాంతాల్లో మురికి వాడల్లోని స్వరాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకే అక్కడి స్థానిక ప్రభుత్వాలు సతమతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.