Coronavirus Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం 11 నెలలు ఆగాల్సిందే, సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి సాధ్యం కాదు, బిల్ గేట్స్ కీలక ప్రకటన, ఏడు ప‌రిశోధ‌న బృందాల‌కు భారీగా నిధులు

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనాను (COVID-19) క‌ట్ట‌డిచేసే వ్యాక్సిన్ త‌యారీ కోసం ఏడు ప‌రిశోధ‌న బృందాల‌కు ఆయ‌న భారీగా నిధులు అంద‌జేస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఏడాదిలోగా వ్యాక్సిన్‌ను (Coronavirus Vaccine) ఉత్ప‌త్తి చేస్తామ‌ని ఆయ‌న బిల్‌గేట్స్ ప్ర‌క‌టించారు. అయితే గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన‌ట్లుగా వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సాధ్యం కాద‌ని ఆయ‌న తెలిపారు.

Bill Gates | File Image | (Photo Credit: Getty Images)

New Delhi, April 27: ప్ర‌పంచ కుబేరుడు బిల్‌గేట్స్ (Bill Gates) క‌రోనాపై యుద్ధాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనాను (COVID-19) క‌ట్ట‌డిచేసే వ్యాక్సిన్ త‌యారీ కోసం ఏడు ప‌రిశోధ‌న బృందాల‌కు ఆయ‌న భారీగా నిధులు అంద‌జేస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఏడాదిలోగా వ్యాక్సిన్‌ను (Coronavirus Vaccine) ఉత్ప‌త్తి చేస్తామ‌ని ఆయ‌న బిల్‌గేట్స్ ప్ర‌క‌టించారు. అయితే గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన‌ట్లుగా వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సాధ్యం కాద‌ని ఆయ‌న తెలిపారు.  లాక్‌డౌన్ కొనసాగింపుకే ప్రధాని మొగ్గు చూపారా?, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, తుది నిర్ణయం ఎప్పుడంటే...?

ఇదిలా ఉంటే కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 మిలియన్ల మందికి (30 లక్షల మంది) సోకింది. ప్రపంచవ్యాప్తంగా 2,05,000 మంది మరణించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాదిలోపే కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీని మొదలు పెట్టనున్నామని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో తెలిపారు.

లేదంటే దీనికి మందు కనుక్కోవడానికి రెండేళ్ళ లోపు సమయం పట్టవచ్చు అన్నారు. అయితే అంత సమయం పట్టక పోవచ్చుకానీ, వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభం కాదని, ఇది తయారు కావడానికి కచ్చితంగా 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

18 నెలలకంటే ఎక్కువ సమయం పట్టదని తాము అంచనా వేస్తున్నామని, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫౌసీని ఉటంకిస్తూ బిల్ గేట్స్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు వందకు పైగా ప్రయత్నాలతో చాలా వేగంగా ముందు కెడుతున్నామనీ, ఈ విషయంలో చాలా ఆశాజనకంగా ఉన్నామన్నారు. వ్యాక్సిన్ అభివృధ్దితో పాటు, వేగంగా తయారీ ప్రక్రియపై కూడా దృష్టిపెట్టినట్టు చెప్పారు.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు తగ్గించే నిర్ణయంపై గతంలో విమర్శలు గుప్పించిన బిల్ గేట్స్ తాజాగా అమెరికాలో ఎక్కువగా పరిక్షలు నిర్వహిస్తున్నామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కూడా ప్రతికూలంగా స్పందించారు. తప్పుడు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారని ఆయన అన్నారు. 24 గంటల లోపు పరీక్షా ఫలితాలు రాకపోయినా సరే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. అసలు ఆ పరీక్షలకు విలువ ఉండని ఆయన పేర్కొన్నారు.