PM Modi on illegal Indian immigrants(X)

Delhi, Feb 14:  అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న భారత్‌కు చెందిన అక్రమ వలసదారులపై మోదీ సంచలన ప్రకటన చేశారు(Modi on Illegal Indian Immigrants).

ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కులేదని(Illegal Indian Immigrants) తేల్చిచెప్పారు. చట్ట విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను(Indians) స్వదేశానికి తీసుకొస్తామని స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉందని ఇది ఎవరు చేసిన స్వాగతించాలన్నారు(PM Modi). ఒకదేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు... ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందని తెలిపారు.

ట్రంప్‌ తో ప్ర‌ధాని మోదీ భేటీ.. ట్రేడ్‌, సుంకాలు, ఇరుదేశాల మ‌ధ్య సంబంధాల‌పై చ‌ర్చ‌.. ప్ర‌ధాని మోదీ గొప్ప నాయకుడు అన్న ట్రంప్‌.. శ్వేత‌సౌధంలో మ‌ళ్లీ ట్రంప్ ను చూడ‌టం ఆనందంగా ఉంద‌న్న మోదీ

డబ్బు, ఉద్యోగాలు ఆశజూపి కొంతమంది యువత, పేదరికంలో ఉన్నవారిని కొంతమంది మోసం చేస్తున్నారని తెలిపారు. ఇలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని.. అలాంటి వాటిని సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నాల్లో భారత్ కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

 PM Modi on illegal Indian immigrants 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలి విడతలో భాగంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక ట్రంప్ బాటలోనే యుకే సైతం అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించింది.

ఇక ఇప్పటికే సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి పంపించివేశారు. దాదాపు 18వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు ఆ దేశ అధికారులు గుర్తించారు.