PM Modi-Donald Trump (Credits: X)

Newyork, Feb 14: అమెరికా పర్యటనలో (US Tour) ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న ప్రధాని.. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న‌తో మోదీ స‌మావేశ‌మ‌వ‌డం ఇదే తొలిసారి.  వాణిజ్యం, సుంకాలు, ఇమిగ్రేష‌న్‌, ఇరుదేశాల మ‌ధ్య దౌత్య సంబంధాలు త‌దిత‌ర కీలక అంశాల‌పై ఇరు దేశాధినేతలు ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్లు సమాచారం. మోదీ వెంట భార‌త విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. కీల‌క భేటీ అనంత‌రం ఇరువురు దేశాధినేత‌లు మీడియాతో మాట్లాడుతూ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు.

అమెరికా టూ ఇండియా.. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపునకు సిద్ధం!

ఒకరిపై మరొకరు ప్రశంసలు

మీడియా వేదికగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ... "శ్వేత‌సౌధంలో మ‌ళ్లీ ట్రంప్ ను చూడ‌టం ఆనందంగా ఉంది. 140 కోట్ల మంది భార‌తీయుల త‌ర‌ఫున ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు. మ‌రో నాలుగేళ్లు ట్రంప్ తో క‌లిసి ప‌ని చేయ‌నుండటం సంతోషంగా ఉంది. భారత్-అమెరికా వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్తాం" అని అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మాట్లాడుతూ... "భార‌త్‌ కు న‌రేంద్ర‌ మోదీ లాంటి నేత ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణం. మోదీ నాకు చాలా ఏళ్లుగా మిత్రుడు. మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొన‌సాగిస్తాం. దేశాలుగా భార‌త్‌, యూఎస్ క‌లిసి ఉండ‌టం చాలా ముఖ్యం” అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

నీ ప్రియుడితో ఎన్ని సార్లు ఎంజాయ్ చేశావు, ఈ రోజు రాత్రి ఎంజాయ్ చేయలేదు కదా, మహిళను దారుణంగా వేధించిన టాక్సీ డ్రైవర్, వీడియో ఇదిగో..