Bandi Sanjay (Photo-ANI)

Hyd, Feb 28: ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు తెలంగాణలో బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై నేతలు చర్చించారు. భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల (Telangana Assembly Elections) ద్వారా తెలంగాణలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితి (BRS)కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఫలితాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో మేం చేపట్టిన కార్యక్రమాలపై జాతీయ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు బండి సంజయ్ (BJP Telangana President Bandi Sanjay).

మద్యం మత్తులో ట్రాఫిక్‌ ఎస్సైని కాలితో తన్నిన యువకుడు, నీకు సెక్షన్లు తెలుసా అంటూ వీరంగం, కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు

తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్‌చుగ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని తరుణ్‌ చుగ్‌ స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించామని, బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జనం భావిస్తున్నారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ‘రకరకాల కార్యక్రమాలతో జనం లోకి వెళ్తున్నాం.స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు విజయవంతం అయ్యాయి. పార్టీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసింది. 119 నియోజకవర్గాల్లో 119 సభలు నిర్వహిస్తాం. ఆ తర్వాత 10 పెద్ద బహిరంగ సభలు పెడతాం. చివరికి ఒక మెగా బహిరంగ సభ ఉంటుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తారు’ అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కూడా త్వరలో అరెస్ట్, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత వివేక్, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు ఇచ్చిందని ఆరోపణలు

రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు 300 సీట్లు దాటింది. ఢిల్లీ లిక్కర్‌ కేసుకు, బీజేపీకు సంబంధం లేదు. ఢిల్లీ లిక్కర్‌ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. లిక్కర కేసు ఛార్జిషీట్‌లో కవిత పేరును సీబీఐ నాలుగు సార్లు పేర్కొంది. కవిత పేరు ప్రస్తావించినప్పుడు సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదు. సిసోడియా అరెస్టుకు, తెలంగాణ బీజేపీ రాజకీయాలకు సంబంధం లేదు’’ అని బండి సంజయ్‌ అన్నారు.