![](https://test1.latestly.com/uploads/images/2025/02/176-21.jpg?width=380&height=214)
Newyork, Feb 14: డాలర్ కలలు (Dollar Dreams) కల్లలుగా మారుతున్నాయి. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నట్టే చేస్తున్నారు. దీంతో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం తీవ్రంగా కొనసాగుతోంది. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులను ఇటీవల బహిష్కరించి (Two More Flights For Indians Deportation) స్వదేశం పంపిన అమెరికా.. తాజాగా మరో రెండు విమానాల్లో ఇండియన్లను పంపతున్నట్టు తెలిసింది. శనివారం బయల్దేరే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరో విమానంలో మరికొంతమందిని తరలిస్తున్నట్టు సమాచారం. ఈ విమానాలను అమృత్ సర్ లో ల్యాండ్ చేయనున్నారు. అయితే, తమ రాష్ట్రంలో విమానాలు ల్యాండ్ చేయడంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడింది. ఆ విమానాలను బీజేపీ పాలిత హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ప్రశ్నించారు.
మరో 487 మంది
అమెరికా బహిష్కరణ జాబితాలో మరో 487 మంది ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ ఇటీవల తెలిపింది. కాగా వారం కిందట అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ లో ల్యాండ్ అయ్యింది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు ఆ విమానంలో 205 మంది లేరు. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించడం తెలిసిందే.