COVID-19 in India: సుప్రీంకోర్టు కీలక తీర్పు, కోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిందే, ఎంత మొత్తం చెల్లించాలనేది కేంద్రానికి వదిలేసిన అత్యున్నత న్యాయస్థానం, మార్గదర్శకాల కోసం ఆరువారాల గడువు
కొవిడ్-19 మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం తప్పనిసరిగా చెల్లించాలని (Pay Ex-Gratia To Families Of COVID-19 Victims) బుధవారం సుప్రీం కోర్టు తీర్చునిచ్చింది.
New Delhi, June 30: కోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్చు నిచ్చింది. కొవిడ్-19 మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం తప్పనిసరిగా చెల్లించాలని (Pay Ex-Gratia To Families Of COVID-19 Victims) బుధవారం సుప్రీం కోర్టు తీర్చునిచ్చింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి ఆరు వారాల గడువు విధించింది. ఎంత మొత్తం అందించాలనే నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వానికే వదిలేసింది.
కాగా కొవిడ్ కారణంగా మరణించిన ప్రతి ఒక్కరికి రూ.4లక్షలు చెల్లించలేమని కొద్ది రోజుల క్రితం కేంద్రం కోర్టుకు (Supreme Court) వెల్లడించిన సంగతి తెలిసిందే. కొవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం వినిపించిన వాదనలను పరిశీలించిన సుప్రీం.. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే నిమిత్తం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్‌డీఎంఏ)ని కనీస ప్రమాణాలు రూపొందించాలని ఆదేశించింది.
తద్వారా కొంత మొత్తం చెల్లించవచ్చని చెప్పింది. కనీస ప్రమాణాలను సూచించడంలో ఎన్‌డీఎంఏ విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే పరిహార నియమాలు, పరిహారం మొత్తాన్ని నిర్ణయించడం తమ పరిధిలో లేదని పేర్కొంటూ.. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం తప్పనిసరి అని కోర్టు (Supreme Court Directs Centre) స్పష్టం చేసింది. కోవిడ్ మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
Here's ANI Update
కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్ట పరిహారం అన్నది కేంద్రమే నిర్ణయించాలని కోర్టు తెలిపింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 12 ప్రకారం పరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర స్పందిస్తూ.. తమ వద్ద సరిపోయినన్ని నిధులు లేవని కోర్టుకు తెలిపింది. కేంద్ర వాదనను అంగీకరించని కోర్టు మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇవ్వాలి అనేది కేంద్రమే నిర్ణయించి 6 వారాల్లో విధివిధానాలు తయారు చేయాలని సూచించింది. విపత్తులో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని రికమండేషన్ చేయడంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.