COVID-19 in Maharashtra: మహారాష్ట్రను వణికిస్తున్న ముంబై, ధారావిలో 7కు చేరిన కరోనా కేసులు, మహారాష్ట్రలో 891కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు
మహారాష్ట్రలోని అత్యధిక కేసులు ముంబై నుంచే ఉన్నాయి. ఇక ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబై ధారావీలో (Dharavi) మంగళవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది.
Mumbai, April 7: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి (COVID-19 in Maharashtra) కరాళ నృత్యం చేస్తోంది.ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. మహారాష్ట్రలోని అత్యధిక కేసులు ముంబై నుంచే ఉన్నాయి. ఇక ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబై ధారావీలో (Dharavi) మంగళవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది.
క్వారంటైన్‌లోకి మహారాష్ట్ర సీఎం భద్రతా సిబ్బంది
స్థానిక అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. 80 ఏళ్లు, 49 సంవత్సరాలు ఉన్న ఇద్దరు పురుషులకు తాజాగా ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ వైరస్ సోకిన మహిళతో వీళ్లు కలిసి ఉన్న కారణంగానే ఆ మహమ్మారి వీరికి సోకినట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. వీరిద్దరు ధారావీలోని బాలిగా నగర్‌కు చెందిన వారిగా గురించారు. గతంలో ధారావీ నుంచి ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 56 సంవత్సాల ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 1వ తేదీన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 354 కొత్త కోవిడ్-19 కేసులు
ఇప్పటికే అధికారులు ధారావీలోని బాలిగా నగర్, వైభవ్ అపార్ట్‌మెంట్, ముకుంద్ నగర్, మదీనా నగర్‌లను సీజ్ చేసింది. ధారావీలో కరోనాను అరికట్టేందుకు స్థానిక అధికారులు వీలైనంత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఇక మహారాష్ట్రలో 748 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. 748మందిలో 56 మంది ఈ మహమ్మారితో పోరాడి గెలిచి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ముంబై ఆస్పత్రిలో కరోనా కల్లోలం
మహారాష్ట్రలో కొత్తగా మరో 23 మందికి కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 891కి చేరింది. కొత్తగా నమోదైన 23 కేసుల్లో 10 మంది ముంబై వాసులే ఉన్నట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పింప్రి చింద్వారా నుంచి నలుగురు, అహ్మద్ నగర్ నుంచి ముగ్గురు, బుల్దానా, నాగ్పూర్ నుంచి ఇద్దరేసి చొప్పున కరోనా బారిన పడగా... సంగ్లీ, థానే ప్రాంతాల్లో ఒక్కరేసి చొప్పున కోవిడ్-19కి గురైనట్టు అధికారులు వెల్లడించారు.
గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ముంబై మురికివాడ ధారావి
కాగా దేశవ్యాప్తంగా కొత్తగా మరో 354 మంది కరోనాతో ఆస్పత్రుల్లో చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య (Coronavirus Pandemic in India) 4,421కి చేరినట్టు తెలిపింది. కరోనా బారిన పడిన మొత్తం 4,421 మందిలో 325 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారనీ.. మిగతా 3981 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేంద్రం పేర్కొంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా దేశంలో 114 మంది ప్రాణాలు కోల్పోయారు.