Maharashtra Coronavirus: క్వారంటైన్‌లోకి మహారాష్ట్ర సీఎం భద్రతా సిబ్బంది, మాతోశ్రీ సమీపంలో ఛాయ్ వాలాకు కరోనావైరస్, కరోనా నియంత్రణ జోన్‌గా సీఎం ఉద్ధవ్ థాకరే నివాసం
Uddhav Thackeray's Security Men Quarantined As Tea Seller Tests Positive For COVID-19 (Photo-ANI)

Mumbai, April 7: కరోనా మహమ్మారి దెబ్బకి మహారాష్ట్ర (Maharashtra Coronavirus) చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా ముంబై నగరంలో (Mumbai) కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా కరోనా సెగ మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Maharashtra Chief Minister Uddhav Thackeray) భద్రతా సిబ్బందికి తాకింది.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 354 కొత్త కోవిడ్-19 కేసులు

ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి (Matoshree) సమీపంలోని ఒక టీ దుకాణదారునికి కరోనా పాజిటివ్ గా తేలింది. లాక్‌డౌన్‌ కంటే ముందు సీఎం భద్రతా సిబ్బంది అంతా అతని కొట్టు వద్దే టీ తాగారు. ముంబై ఆస్పత్రిలో కరోనా కల్లోలం

దీంతో వారంతా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. సిబ్బందికి టీ అందించిన వ్యక్తికి (Tea Seller) కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడంతో సీఎంకు సెక్యూరిటీగా ఉన్న 170 మంది పోలీసులు, ఇతర అధికారులు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లోని ఉత్తర భారతీయ సంఘ్ భవనంలో వారిని నిర్బంధించినట్లు అధికారులు తెలిపారు.

సీఎం అధికారిక నివాసం మాతోశ్రీకి సీలు వేసి ఆ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా బీఎంసీ అధికారులు ప్రకటించారు. సీఎం నివాసమున్న ప్రాంతాన్ని కరోనా నియంత్రణ జోన్ గా ప్రకటించి ఎవరూ అటువైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి నివాసం చుట్టుపక్కల మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా స్ప్రేయింగ్ చేశారు.

Here's ANI Tweet

కాగా, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే గత కొద్ది రోజులుగా భద్రతా సిబ్బంతో సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని అధికారులు వెల్లడించారు. తన కారును కూడా తానే డ్రైవింగ్‌ చేసుకుంటూ పలు కార్యక్రమాలను హాజరయ్యారని తెలిపారు. అయినప్పటికీ ఇటీవల సీఎంను ఎవరెవరు కలిశారో వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటికే రెండు ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన 39 మందిలో కరోనా ఇన్ఫెక్షన్ కనిపించిన నేపథ్యంలో ఆ ఆసుపత్రులను మూసివేశారు. కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 868 మందికి కరో​నా వైరస్‌ సోకింది. 45 మంది మరణించారు.