COVID-19 Patient Recovery Fact: ఢిల్లీలో తొలి కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడా?, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత ?

మన దేశంలో ఈ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. వ్యాధి తీవ్రత ఎంతగా ముదిరినప్పటికీ దానికి విరుగుడు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఫస్ట్ కరోనా బాధితుడు ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడనే వార్త ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అందులో నిజమెంతో తెలియదు కాని అది బాగా వైరల్ అవుతోంది. కొందరు దీనిని ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు.

Coronavirus Outbreak in China (Photo Credits: IANS)

New Delhi,Mar 16: ఇప్పుడు కరోనావైరస్ (Coronavirus) ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని గడగడలాడిస్తోంది. మన దేశంలో ఈ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. వ్యాధి తీవ్రత ఎంతగా ముదిరినప్పటికీ దానికి విరుగుడు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు.

కరోనా దెబ్బకి మహారాష్ట్ర విలవిల

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఫస్ట్ కరోనా బాధితుడు ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడనే వార్త ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అందులో నిజమెంతో తెలియదు కాని అది బాగా వైరల్ అవుతోంది. కొందరు దీనిని ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు. అసలు అలాంటి వ్యక్తి అక్కడ లేనే లేడని తొలి పేషెంట్ పేరు అది కానే కాదని అంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో ఓ సారి చూద్దాం. ఢిల్లీకి (Delhi) చెందిన 45 సంవత్సరాల రోహిత్ దత్తా (Rohit dutta) అనే బిజినెస్ మెన్ ఈ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. కొన్ని రోజుల తర్వాత రికవరీ అయ్యాడు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఓ జాతీయ ఛానెల్‌కు వివరించారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Here's The Tweets

 

ఢిల్లీలో 45 సంవత్సరాలుగల బిజినెస్ మెన్‌లో కరోనా వైరస్ (COVID-19) లక్షణాలు కనిపించాయి. ఇతను దేశ రాజధానిలో మొదటి వ్యక్తిగా (Delhi's First Coronavirus Patient) నమోదయ్యారు. ఢిల్లీలోని సప్దర్ గంజ్ ఆసుపత్రికి (Delhi’s Safdarjung Hospital) తరలించి రెండు వారాలుగా చికిత్స అందించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ..భయపడాల్సిన అవసరం లేదని, సాధారణ ఫ్లూ లాంటిదని అభివర్ణించారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ధియేట్లరు, స్కూళ్లు, పబ్‌లు, మాల్స్ అన్నీ బంద్

ఈ వ్యాధి అనుమానం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే..బాగుంటుందని సూచించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి..చికిత్స అందించడం వల్ల..ఆరోగ్యం మెరుగైందన్నారు. మరో 14 రోజలు పాటు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించారని తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన వైద్య బృందం చక్కటి సహాయసహకారాలు అందించి ధైర్యం నింపారని కొనియాడారు. తాను 2020, ఫిబ్రవరి 25వ తేదీన యూరప్ నుంచి తిరిగి రావడం జరిగిందని, మరుసటి రోజు తనకు జ్వరం వచ్చిందన్నారు. వైద్యుడి దగ్గరకు వెళ్లగా..గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పడం జరిగిందన్నారు.

Here's The Facebook Post

మూడు రోజుల పాటు మందులు వాడినప్పటికీ తగ్గకపోవడంతో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. అక్కడ కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడం జరిగిందన్నారు. దీంతో సప్దార్ గంజ్ ఆసుపత్రి వైద్య బృందం తనను చూడటానికి వచ్చిందని, తనకు చాలా ధైర్యం చెప్పారని తెలిపారు.

కేవలం జలుబు, దగ్గు ఉంటుందని, కానీ కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని వారు వివరించినట్లు చెప్పారు. కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో..కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొందని, అందులో భాగంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తనకు అందులో ఉంచి చికిత్స అందించారన్నారు. ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయని, ప్రైవేటు హాస్పిటల్స్‌కు ధీటుగా ఉన్నాయన్నారు. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాగా కరోనా వైరస్ కారణంగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా బాధితుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 110 కేసులు నమోదయ్యాయి. అందులో మహారాష్ట్ర నుంచే అధికంగా ఉన్నాయి.