Mumbai, Mar 16: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus Scare) వణుకుపుట్టిస్తోన్న సంగతి విదితమే. ఇది ఇండియాలో మరీ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రను (Maharashtra) ఈ కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ కోవిడ్ –19 (కరోనా వైరస్) మహారాష్ట్రలో వేగంగా వ్యాపిస్తోంది. అక్కడ ఒక్కరోజులోనే 16 మంది కోవిడ్ రోగులు (Novel coronavirus cases) పెరిగారు. దీంతో రాష్టంలో కరోనా బాధితుల సంఖ్య 32కి చేరింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ధియేట్లరు, స్కూళ్లు, పబ్‌లు, మాల్స్ అన్నీ బంద్
రాష్ట్రంలో ఈ కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ఉద్ధవ్ సర్కారు తాజాగా పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కళాశాలలు, అంగనవాడి కేంద్రాలన్నింటిని మార్చి 31వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ పరీక్షలు మాత్రం కొనసాగనున్నాయన్నారు. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగనవాడి కేంద్రాలు బంద్ ఉండనున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తోందని, కోవిడ్ –19(కరోనా వైరస్) లక్షణాలున్నవారిని గుర్తించి వారికీ వెంటనే పరీక్షలు నిర్వహించి చికిత్స నిర్వహిస్తున్నారమని ఆయన అన్నారు.
Here's PIB India Tweet
107 confirmed cases of #Coronavirus in the country so far; 10 patients cured. #CoronaIndia #CoronaOutbreak pic.twitter.com/hjxXGkzlla
— PIB India (@PIB_India) March 15, 2020
కోవిడ్ –19(కరోనా వైరస్) రోగుల చికిత్స కోసం సంబంధిత ఆసుపత్రులలో కావల్సిన వేంటిలేటర్స్, బెడ్ ఇతర మందులు, మాస్క్‌లు, సనిటైజర్ తదితరాలు అందుబాటులో ఉంచుతోంది.
రూ.4 లక్షలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కేంద్రం
విదేశాల నుంచి వచ్చిన వారికి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది. ముఖ్యంగా అనవసరంగా రద్దీ చేయవద్దని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రభుత్వం సూచిస్తోంది. వీరిలో అత్యధికంగా పుణేలో 16, ముంబైలో ఐదుగురు, నాగపూర్‌లో నలుగురు, థానేలో ఒక్కరు, యావత్మాల్‌లో ఇద్దరు, కళ్యాణ్‌లో ఒక్కరు, అహ్మదనగర్‌లో ఒక్కరు, రాయిగడ్‌లో ఒక్కరు నవీముంబైలో ఒక్కరు ఇలా వైరస్ పాజిటీవ్ వచ్చిందన్నారు.
దీంతో రాష్ట్రంలోని కరోనా బారిన పడిన వారి సంఖ్యలో దేశంలోనే అత్యధికంగా మారింది. అయితే ఈ విషయంపై భయాందోళనలు చెందకుండా అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో వైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 107కి (Coronavirus Cases in India) చేరింది. ముంబై తరువాత కర్ణాటక, కేరళలో వైరస్ తీవ్రత అధికారంగా ఉంది.
కరోనా రోగుల చికిత్స కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు చెందకుండా ఉండేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఈ వైరస్ బారిన పడిన వారి చికిత్స ఖర్చును ప్రభుత్వం భరించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
COVID-19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 16 నుండి మార్చి 25 వరకు 10 రోజులు కరోనావైరస్ పై అవగాహన సందేశాలను ప్రదర్శించాలని లైసెన్స్ పొందిన హోర్డింగ్ యజమానులకు BMC లేఖ రాసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, వారు నియమాలను పాటించడంలో విఫలమయితే వారిపై పౌరసంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా నగరంలో దాదాపు 1,200 హోర్డింగ్‌లు వివిధ పరిమాణాల ఎత్తైన ప్రదేశాలు మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి.