Delhi Coronavirus: కరోనా భయంతో కరువైన మానవత్వం, ఢిల్లీలో నడిరోడ్డుపై వృద్ధుడు పడిపోతే పట్టించుకోని వైనం, దేశ రాజధానిలో దడపుట్టిస్తున్న కరోనావైరస్
గురువారం ఒక్కరోజే అక్కడ 1106 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత 24 గంటల్లో82 మంది కరోనాతో మరణించారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) ఈ వివరాలను వెల్లడించింది. ముందుగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిషోడియా మాట్లాడుతూ.. గురువారం కొత్తగా 82 కరోనా మరణాలు నమోదయ్యాయని చెప్పారు. అందులో 13 మరణాలు గత 24 గంటల వ్యవధిలో చోటుచేసుకోగా.. 69 మరణాలు గత 34 గంటల వ్యవధిలో చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు. దీంతో ఢిల్లీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య ( Coronavirus in Delhi) 398కి చేరిందన్నారు.
New Delhi, May 29: ఢిల్లీలో కరోనా వైరస్ (Delhi Coronavirus) కల్లోలం సృష్టిస్తున్నది. గురువారం ఒక్కరోజే అక్కడ 1106 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత 24 గంటల్లో82 మంది కరోనాతో మరణించారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) ఈ వివరాలను వెల్లడించింది. లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించండి, కేంద్రాన్ని కోరిన గోవా సీఎం ప్రమోద్ సావంత్, మే 31తో నాలుగవ దశ లాక్‌డౌన్ క్లోజ్
ముందుగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిషోడియా మాట్లాడుతూ.. గురువారం కొత్తగా 82 కరోనా మరణాలు నమోదయ్యాయని చెప్పారు. అందులో 13 మరణాలు గత 24 గంటల వ్యవధిలో చోటుచేసుకోగా.. 69 మరణాలు గత 34 గంటల వ్యవధిలో చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు. దీంతో ఢిల్లీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య ( Coronavirus in Delhi) 398కి చేరిందన్నారు.
అంతకుముందు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కరోనా కేసుల వివరాలను వెల్లడించారు. గురువారం ఒక్కరోజే కొత్తగా 1106 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. దీంతో ఢిల్లీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,386కు చేరిందన్నారు. మొత్తం కేసులలో 7,846 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని జైన్ తెలిపారు. డిశ్చార్జి అయిన వారు, మృతులు పోగా మిగిలిన వారంతా యాక్టివ్ కేసులుగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
Take a Look at the Tweets:
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఓ బిజీ రోడ్డులో 65 ఏళ్ల వృద్ధుడు పడిపోయి ఉంటే కరోనా భయంతో ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు మూడు గంటలపాటు అలానే ఉండగా.. ఎట్టకేలకు చివరికి పీపీఈ కిట్ వేసుకుని వచ్చి పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలతో లేడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఢిల్లీలోని యూసఫ్ సరాయ్ మార్కెట్ ప్రాంతంలో జరిగింది. లాక్‌డౌన్ 5.0పై రంగంలోకి అమిత్ షా, లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తీసుకున్న హోంమంత్రి, మే 31న తుది నిర్ణయం
వివరాల్లోకెళితే..ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో గతంలో అటెండర్ గా పని చేసిన 65 ఏళ్ల వృద్ధుడు యూసఫ్ సరాయ్ వద్ద బుధవారం మధ్యాహ్నం మండిపోయే ఎండలో స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. కానీ ఎవరూ అతడి దగ్గరకు వెళ్లి చూసేందుకు కూడా ధైర్యం చేయలేకపోయారు. అతడికి కరోనా వైరస్ సోకి ఉంటుందేమోనన్న భయంతో ఎవరూ దగ్గరకు వెళ్లలేదు. చాలా గంటల తర్వాత పీపీఈ కిట్లు ధరించి అక్కడికి వచ్చిన పోలీసులు లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడు మరణించినట్లు చెప్పారు.