New Delhi, May 28: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ముఖ్యమంత్రులందరితో మాట్లాడి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపుపై (Lockdown 5.0 Strategy) వారి అభిప్రాయాలను కోరారు. అందుతున్న నివేదికల ప్రకారం కరోనావైరస్ వ్యాప్తిని కలిగి ఉండటానికి మార్చి 25 న విధించిన లాక్‌డౌన్ (Lockdown) నుంచి నేటివరకు అమిత్ షా (Amit Shah) ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కోరినట్లుగా తెలుస్తోంది. మార్చి 25 నుండి, లాక్డౌన్ నాలుగుసార్లు (Lockdown 4.0) పొడిగించబడిన సంగతి విదితమే. నాలుగో దశ లాక్‌డౌన్ మే 31 ఆదివారం ముగియనుంది. లాక్‌డౌన్ 5 తప్పదా..? 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,466 కేసులు నమోదు, దేశంలో లక్షా అరవై ఐదు వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 4,706 మంది మృతి
నివేదికల ప్రకారం, ముఖ్యమంత్రులు (States CMs) అందరూ లాక్ డౌన్ తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారనే దానిపై తమ అభిప్రాయాలను హోంమంత్రికి తెలియజేశారు. ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన అమిత్ షా..ఏఏ రంగాలకు మినహాయింపు అవసరం? ఎలాంటి సమస్యలున్నాయి? వంటి అంశాలపై చర్చించారు. సీఎంలు ఏం చెప్పారనే విషయం వెల్లడి కానప్పటికీ, ఏదో ఒక రూపంలో లాక్‌డౌన్ పొడిగింపునకే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు సమాచారం. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు, జన జీవనం సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం తుది నిర్ణయాన్ని రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్ 5 ఉంటుందా లేక ఇదే లాస్ట్ అవుతుందా? ప్రారంభమైన విమానాలు, రైళ్లు, షాపులు, ఇండియా సాధారణ స్థితికి చేరుకున్నట్లేనా..?
గతంలో, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా దేశాధినేతలతో లాక్ డౌన నిబంధనలు గురుంచి మాడ్లాడగా అమిత్ షా ఈ సారి అన్ని విషయాలను చర్చించినట్లు సమాచారం. కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన 13 నగరాల్లో పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సమీక్షించారు. హైదరాబాద్ సహా 13 నగరాల్లోనే 70 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లతో కేబినెట్ కార్యదర్శి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులూ హాజరయ్యారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ/న్యూఢిల్లీ, అహ్మదాబాద్, థానే, పుణే, కోల్‌కతా/హౌరా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్పట్టు, తిరువల్లూరు నగరాల్లో కోవిడ్ పరిస్థితులపై చర్చించారు. వలస కార్మికుల నుండి ఛార్జీలు వసూలు చేయకూడదు, వారికి ఆహారం, నీరు అందించాలి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
మార్చి 24 న ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 25 నుండి 21 రోజుల దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ఏప్రిల్ 14 న లాక్డౌన్ వ్యవధిని మే 3 వరకు పొడిగించారు. ఆ తర్వాత లాక్డౌన్ను మే 17 వరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) పొడిగించింది. ఆ తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ (ఎన్‌డిఎంఎ) మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. మార్చి 25 నుండి విద్యా రంగాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు ఇతర ఆతిథ్య సేవలను నిలిపివేశారు. కాగా రానున్న లాక్డౌన్ 5.0 సమయంలో సాధ్యమయ్యే సడలింపులు అలాగే మినహాయింపులపై అమిత్ షా రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు కోరారు.
న్యూస్ 18 యొక్క నివేదిక ప్రకారం, లాక్డౌన్ 5.0 మాల్స్, సినిమా హాళ్ళు, పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర విద్యా సంస్థల ప్రారంభంపై ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉంది. లాక్డౌన్ 4.0 వరకు మూసివేయాలని ఆదేశించిన జిమ్‌లను కంటైనేషన్ జోన్లలో మినహా ఈసారి ఆపరేట్ చేయడానికి అనుమతించవచ్చని నివేదిక పేర్కొంది.
కరోనావైరస్ ద్వారా ఎక్కువగా ప్రభావితమైన నగరాల్లో జూన్ 1 నుండి లాక్డౌన్ 5.0 ప్రారంభమయ్యే అవకాశం ఉందని డెక్కన్ హెరాల్డ్ యొక్క నివేదిక పేర్కొంది. ఐదవ దశ లాక్‌డౌన్ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలను తగ్గిస్తుందని, మెట్రో, బస్సులు వంటి రవాణా సేవలు తిరిగి ప్రారంభించవచ్చని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, సామూహిక సమావేశాలు మరియు మతపరమైన ఉత్సవాలపై కఠినమైన నిషేధంతో సామాజిక దూర నిబంధనలతో మతపరమైన ప్రదేశాలు తెరవబడతాయని కూడా నివేదిక తెలిపింది.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు వెలుగుచూస్తున్న 11 నగరాలపైనే లాక్‌డౌన్ 5.0 ప్రధానగంగా దృష్టిసారిస్తుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. జూన్ 1 నుంచి మొదలయ్యే లాక్‌డౌన్ 5.0 ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూర్, పుణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్‌కతా నగరాల్లో కరోనా కట్టడిపై ఫోకస్ చేయనుంది. ఇక దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కరోనా కేసుల్లో అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, కోల్‌కతా, ముంబై నగరాల్లోనే 60 శాతం కేసులు నమోదవడంతో ఈ నగరాల్లో మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుందని సమాచారం.