Mumbai, May 29: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు (India Coronavirus) నమోదు కాగా, 175మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 1,65,799కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కాగా, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 4,706 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. ప్రస్తుతం 89,987 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయిదు రాష్ట్రాలతో రవాణా సంబంధాలు తెంచుకున్న కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి ద్వారా ఎక్కువవుతున్న కరోనా కేసులే కారణం
మహారాష్ట్రలో అత్యధికంగా 59,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,982 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 19,372(మృతులు 148), ఢిల్లీలో 16,281(మృతులు 316), గుజరాత్‌లో 15,572(మృతులు 960), రాజస్థాన్‌లో 8,067(మృతులు 180), మధ్యప్రదేశ్‌లో 7,453(మృతులు 321), యూపీలో 7,170(మృతులు 197), పశ్చిమ బెంగాల్‌లో 4,536(మృతులు 295), ఏపీలో 3,245, బీహార్‌లో 3,185, కర్ణాటకలో 2,533, తెలంగాణలో 2,256 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వలస కార్మికుల నుండి ఛార్జీలు వసూలు చేయకూడదు, వారికి ఆహారం, నీరు అందించాలి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ భారత్‌లో ఈ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండటంతో మే 31తో లాక్‌డౌన్‌ను ( Lockdown) ముగించాలన్న నిర్ణయంపై కేంద్రం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. తొలుత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 11 నగరాలకే లాక్‌డౌన్ పొడిగింపును పరిమితం చేయాలని భావించినప్పటికీ.. తాజాగా సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. మే 31న మన్ కీ బాత్‌లో కేంద్రం నిర్ణయంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశముంది.