Coronavirus in India | (Photo Credits: PTI)

Bengaluru, May 29: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ప్రభావం (COVID-19 Impact) ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలను నిషేధించింది. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి వచ్చే విమాన ప్రయాణాన్ని నిలిపివేయాలని (Karnataka Bans Flights, Trains) కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల నుండి ఛార్జీలు వసూలు చేయకూడదు, వారికి ఆహారం, నీరు అందించాలి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

ఈ రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే వారిలో టెస్టులు చేయగా వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధిక సంఖ్యలో కరోనావైరస్‌ కేసులు నమోదవుతున్న ఈ రాష్ట్రాల నుంచి విమానాలను నిలిపివేయాలనే నిర్ణయం కేబినెట్‌ సమావేశంలో తీసుకున్నట్లు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసీ మధుస్వామి తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే ప్రజల వల్ల కర్ణాటకలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఐదు రాష్ర్టాల నుంచి విమాన రవాణాను నిలిపివేయాలని నిర్ణయించామని మంత్రి మధుస్వామి అన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ నుంచి కర్ణాటకలోకి రోడ్డు మార్గంలో ప్రవేశించడానికి ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రానివ్వొచ్చని ఆయన అన్నారు. దాదాపు రెండు నెలల లాక్డౌన్‌ తర్వాత దేశీయ విమాన ప్రయాణం సోమవారం తిరిగి ప్రారంభమైంది. కరోనా కట్టడిలో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తలు వహిస్తుంది. రెండు రాష్ట్రాల్లో 30 వేల పెళ్లిల్లు వాయిదా, దేశంలో లక్షా యాభై ఎనిమిది వేలు దాటిన కరోనా కేసులు, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4531

కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో చాలా మందికి వైరస్‌ సోకినట్లు తేలడం సహా వారిని ప్రభుత్వ క్వారంటైన్ చేయడంలో సమస్యలు తలెత్తిన కారణంగానే యడ్డీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ​కేరళ నుంచి వచ్చేవారిని మే 31 వరకు రాష్ట్రంలోకి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం ఇదివరకే తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లను కూడా ఈ జాబితాలో చేర్చింది.

కర్ణాటకలో కొత్తగా 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2533కు చేరుకుంది. వీటిలో 1650 యాక్టివ్ కేసులుండగా..ఇప్పటివరకు 834 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. కరోనాతో 47 మంది మృతి చెందినట్లు కర్ణాటక వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రవాణాపై ఆంక్షలు విధించింది.