India Coronavirus: రెండు రాష్ట్రాల్లో 30 వేల పెళ్లిల్లు వాయిదా, దేశంలో లక్షా యాభై ఎనిమిది వేలు దాటిన కరోనా కేసులు, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4531
Coronavirus Screening | (Photo Credits: AFP)

New Delhi, May 28: భారత్‌లో కరోనా వైరస్‌ (India Coronavirus) విజృంభణ కొనసాగుతుంది.గత 24 గంట‌ల్లో దేశంలో కొత్త వైర‌స్ కేసుల సంఖ్య 6566గా న‌మోదు అయ్యింది. ఇక గ‌త 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 194గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ (Health Ministry, India) వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన కరోనా వైర‌స్ కేసుల సంఖ్య 1,58,333గా ఉంది. దీంట్లో 86110 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 67692 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4531కి చేరుకున్న‌ది. కరోనాని జయించిన నెల శిశువు, చప్పట్లతో అభినందనలు తెలిపిన ఆస్పత్రి సిబ్బంది., సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో 56,948 కరోనా కేసులు నమోదు కాగా, 1,897 మంది మృతిచెందారు. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి నిష్పత్తి మెరుగ్గా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో రికవరీ రేటు (Recovery Rate) 42.45 శాతంగా ఉన్నట్టు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఇదొక అద్భుతం, కరోనా నుంచి 6 రోజుల్లోనే కోలుకున్న హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్, దేశంలో ఇదే తొలికేసు

ఒడిశాలో రాష్ట్రంలో కొత్తగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1593కు చేరుకుంది. వీటిలో 853 కేసులు యాక్టివ్‌గా ఉండగా...733 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఇప్పటివరకు ఒడిశాలో కరోనాతో ఏడుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒడిశాలో మరో నెలపాటు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Statewise Table of Coronavirus Cases:

S. No. Name of State / UT Total Confirmed cases* Cured/Discharged/Migrated Deaths**
1 Andaman and Nicobar Islands 33 33 0
2 Andhra Pradesh 3171 2057 58
3 Arunachal Pradesh 2 1 0
4 Assam 781 87 4
5 Bihar 3061 1083 15
6 Chandigarh 279 187 4
7 Chhattisgarh 369 83 0
8 Dadar Nagar Haveli 2 0 0
9 Delhi 15257 7264 303
10 Goa 68 37 0
11 Gujarat 15195 7549 938
12 Haryana 1381 838 18
13 Himachal Pradesh 273 70 5
14 Jammu and Kashmir 1921 854 26
15 Jharkhand 448 185 4
16 Karnataka 2418 781 47
17 Kerala 1004 552 7
18 Ladakh 53 43 0
19 Madhya Pradesh 7261 3927 313
20 Maharashtra 56948 17918 1897
21 Manipur 44 4 0
22 Meghalaya 20 12 1
23 Mizoram 1 1 0
24 Nagaland 4 0 0
25 Odisha 1593 733 7
26 Puducherry 46 12 0
27 Punjab 2139 1918 40
28 Rajasthan 7703 4457 173
29 Sikkim 1 0 0
30 Tamil Nadu 18545 9909 133
31 Telengana 2098 1284 63
32 Tripura 230 165 0
33 Uttarakhand 469 79 4
34 Uttar Pradesh 6991 3991 182
35 West Bengal 4192 1578 289
Cases being reassigned to states 4332
Total 158333 67692 4531

త‌మిళ‌నాడులో బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 817 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,545కు చేరింది. మొత్తం కేసుల‌లో 9,909 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. బుధ‌వారం మ‌ర‌ణించిన ఆరుగురు క‌రోనా బాధితుల‌తో క‌లిపి మొత్తం 133 మంది మృతిచెందారు. 9,909 డిశ్చార్జిలు, 133 మ‌ర‌ణాలు పోను రాష్ట్రంలో మొత్తం 8500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

కేరళలో కొత్తగా 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ పేర్కొన్నారు. వీరిలో 9 మంది విదేశాల నుంచి రాష్ర్టానికి రాగా..16 మంది మహారాష్ట్ర, ఐదుగురు తమిళనాడు, ముగ్గురు ఢిల్లీ నుంచి వచ్చారని తెలిపారు. ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 1004కు చేరుకోగా..వీటిలో 445 యాక్టివ్‌ కేసులున్నాయని సీఎం పినరయి విజయన్‌ వెల్లడించారు. మంగళవారం నాటికి వివిధ దేశాల్లో ఉన్న 173 మంది కేరళవాసులు కరోనాతో చనిపోయారని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 75 పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తాజా కేసులతో మహారాష్ట్రంలో ఇప్పటివరకు 1964 మంది పోలీసులకు కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర పోలీస్‌ శాఖ వెల్లడించింది. వీటిలో 849 మంది పోలీసులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జవగా...1095 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొంది. 20 మంది పోలీసులు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 54,758 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 1792కు చేరుకుంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ‌త వారం రోజులుగా ప్ర‌తి రోజు 500కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 792 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ప‌దిహేను వేల మార్కును దాటి 15,257కు చేరింది. మ‌ర‌ణాల సంఖ్య కూడా ఇప్ప‌టి వ‌ర‌కు 303కు చేరుకున్న‌ది. ఇక ఢిల్లీలో న‌మోదైన మొత్తం 15,257 కేసుల‌లో 7264 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రిక‌వ‌రీ అయిన వారు, 303 మ‌ర‌ణాలు పోగా ఇంకో 7,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

కరోనా ప్రభావంతో గత రెండు నెలల్లో గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వివాహాలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో గుజరాత్‌లో సుమారు 30 వేల పెండ్లిండ్లు వాయిదా పడటం గానీ, రద్దవ్వడం గానీ జరిగిందని హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ గుజరాత్‌ అధికార ప్రతినిధి అభిజిత్‌ దేశ్‌ముఖ్‌ బుధవారం తెలిపారు. కొన్ని జంటలు మాత్రం సుమారు 10 మంది సన్నిహిత బంధువుల మధ్య ఒక్కటయ్యాయన్నారు. చాలా మంది పంక్షన్‌ హాళ్ల బుకింగ్‌లు రద్దు చేసుకుని తదుపరి శుభముహూర్తాల కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ 80 శాతం పెండ్లిండ్లు ఆగిపోయాయి.