Goa CM Pramod Sawant (Photo Credits: ANI)

New Delhi, May 29: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను (Lockdown 5.0) మరో 15 రోజులు పొడిగించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ (Goa CM Pramod Sawant) కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో (Amit Shah) ప్రమోద్ సావంత్ ఫోన్‌లో మాట్లాడారు. మరో 15 రోజులు పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని సూచించారు. లాక్‌డౌన్ 5.0పై రంగంలోకి అమిత్ షా, లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తీసుకున్న హోంమంత్రి, మే 31న తుది నిర్ణయం

ANI ప్రకారం, "లాక్డౌన్ యొక్క తరువాతి దశలో కొంత సడలింపులు ఉండాలని మేము కోరుతున్నాము. 50 శాతం సామర్థ్యంతో సామాజిక దూరంతో రెస్టారెంట్లను అనుమతించాలి. చాలా మంది జిమ్‌లు కూడా తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాగా గురువారం అమిత్ షా ముఖ్యమంత్రులందరితో మాట్లాడి దేశవ్యాప్తంగా లాక్డౌన్పై తమ అభిప్రాయాలను కోరారు. లాక్డౌన్ పొడిగింపుపై అన్ని ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని ఆయన కోరారు. భారత్ ప్రస్తుతం లాక్డౌన్ యొక్క నాలుగవ దశలో ఉంది. నాలుగో దశ లాక్‌డౌన్ మే 31 ఆదివారం ముగియనుంది.

Goa CM Feels Lockdown 5.0 May Be Extended by 15 Days:

కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దానిని నియంత్రించడానికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కి పిలుపు నివ్వబడిన సంగతి విదితమే. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చే కొద్దీ ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుత COVID-19 సంఖ్య 1,65,799 వద్ద ఉంది. మరణాల సంఖ్య శుక్రవారం 4,706 కు పెరిగింది మరియు ఇది చైనాలో మొత్తం COVID-19 మరణాలను అధిగమించింది.

ఇదిలా ఉంటే మరొక లాక్డౌన్కు ఉండే అవకాశం ఉందని వివిధ మీడియా నివేదికలు చెబుతున్నాయి. న్యూస్ 18 యొక్క నివేదిక ప్రకారం, లాక్డౌన్ 5.0 మాల్స్, సినిమా హాళ్ళు, పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర విద్యా సంస్థలపై పరిమితులను కొనసాగించే అవకాశం ఉంది. కంటైనేషన్ జోన్లలో మినహా ఈసారి జిమ్‌లు పనిచేయడానికి అనుమతించవచ్చని ఒక అంచనా ఉంది.