COVID-19 in India: లక్షా యాభై వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశ వ్యాప్తంగా 4,337 మంది మృతి
దాని వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా కేసులు నమోదు కాగా, 170 మంది మృతి (COVID-19 Deaths) చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) 1,51,767కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 64,425 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,337 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 83,004 కరోనా యాక్టివ్ కేసులు (2020 Coronavirus Pandemic India) ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా రోజువారి కేసుల సంఖ్యలో కొద్దిగా తగ్గుదల కనిపిస్తోంది.
New Delhi, May 27: కరోనా మహమ్మారి భారత్‌ను (COVID-19 in India) వణికిస్తోంది. దాని వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా కేసులు నమోదు కాగా, 170 మంది మృతి (COVID-19 Deaths) చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) 1,51,767కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వర్మ 'కరోనా వైరస్' ట్రైలర్, జగన్,కేసీఆర్ పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ డైలాగ్స్ ట్రైలర్‌కి హైలైట్, యూట్యూబ్‌లో ట్రెండింగ్ ఇదే
ఇప్పటివరకు 64,425 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,337 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 83,004 కరోనా యాక్టివ్ కేసులు (2020 Coronavirus Pandemic India) ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా రోజువారి కేసుల సంఖ్యలో కొద్దిగా తగ్గుదల కనిపిస్తోంది. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో ప్రమాదమేమి లేదు, వైద్యుల పర్యవేక్షణలో వాడండి, స్పష్టం చేసిన ఐసీఎంఆర్, ఇదివరకే దీనిపై నిషేధం విధించిన డబ్ల్యూహెచ్‌ఓ
మహారాష్ట్రలో అత్యధికంగా 54,758 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 16,954 మంది కోలుకోగా, 1,792 మంది మృతిచెందారు. తమిళనాడులో 17,728 కేసులు(మృతులు 128), గుజరాత్‌లో 14,829(మృతులు 915), ఢిల్లీలో 14,465(మృతుల 288), రాజస్థాన్‌లో 7,536(మృతులు 170), మధ్యప్రదేశ్‌లో 7,024(మృతులు 305), యూపీలో 6,724(మృతులు 177), బెంగాల్‌లో 4,009 పాజిటివ్ కేసులు (మృతులు 283) నమోదు అయ్యాయి. హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్రయల్స్ ఆపేయండి, ఈ డ్రగ్ తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో
హైడ్రాక్సిక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) ఔషధం వాడకంతో పెద్దగా దుష్ప్రభావాలేవీ లేవనీ, కోవిడ్–19 నివారణ, చికిత్సలో దీని వాడకం కొనసాగించాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. కోవిడ్–19 రోగుల భద్రత దృష్ట్యా హెచ్‌సీక్యూను ప్రయోగాత్మకంగా వాడటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ణయించిన నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ మేరకు పేర్కొంది. ‘హెచ్‌సీక్యూ వాడకంతో కొద్దిపాటి వికారం, వాంతులు, గుండెదడ తప్ప మరే ఇతర తీవ్ర దుష్ప్రభావాలు మా అధ్యయనంలో కనిపించలేదు. అందుకే, కోవిడ్–19 నివారణకు దీనిని వాడవచ్చని సిఫారసు చేస్తున్నాం’ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు.