COVID-19 Vaccine Update: ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది, క్రిస్మస్ కంటే ముందే ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్‌ని తీసుకువస్తామని తెలిపిన బయోఎన్‌టెక్ సీఈవ్ ఉగుర్ సాహిన్
అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది క్రిస్మస్ కంటే ముందే ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ (Pfizer-BioNTech Vaccine) డెలివరీ మొదలు పెట్టనున్నామని బయోఎన్‌టెక్ సీఈవ్ ఉగుర్ సాహిన్ రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.
Washington, November 19: అమెరికా కంపెనీ ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ (COVID-19 Vaccine Update) మీద శుభవార్తను అందించింది. అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది క్రిస్మస్ కంటే ముందే ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ (Pfizer-BioNTech Vaccine) డెలివరీ మొదలు పెట్టనున్నామని బయోఎన్‌టెక్ సీఈవ్ ఉగుర్ సాహిన్ రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. కాగా అమెరికా కంపెనీ ఫైజర్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్ టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
యూరోప్‌లో ఈ వ్యాక్సిన్‌కు డిసెంబర్ రెండవ వారంలో ఆమోదం దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే.. డిసెంబర్ మధ్యలో టీకాకు అనుమతి దక్కుతుందని ఉగుర్ సాహిన్ తెలిపారు. అమెరికా కంపెనీ ఫైజర్, జర్మనీ భాగస్వామి బయోఎన్‌టెక్ సంయుక్తంగా కోవిడ్ టీకాను తయారు చేస్తున్నాయి. తమ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో 95 శాతం ప్రభావవంతంగా పనిచేసిందని బుధవారం ఫైజర్ వెల్లడించింది.
జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన ఈ టీకా తుది ప్రయోగ ఫలితాలను ఫైజర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జాతుల వారు, భిన్న వయస్కులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూశామని తెలిపింది. త్వరలో అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేస్తామని తెలిపింది. ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుంది.
65 ఏళ్లు పైబడిన పెద్దలలో కూడా తమ టీకా సామర్థ్యం 94శాతం కంటే ఎక్కువేననని తుది ప్రయోగ ఫలితాల్లో తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జాతుల, భిన్న వయస్కులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూశామని తెలిపింది. ఫైజర్ టీకాను మైనస్ 70డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుందని పేర్కొంది. త్వరలో అమెరికాలో అత్యవసర వినియోగం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేస్తామని వెల్లడించింది.