Covid Updates: దేశంలో కొత్తగా 18,645 కోవిడ్ కేసులు నమోదు, తెలంగాణలో 351 మందికి కరోనా పాజిటివ్, ఏపీలో తాజాగా 199 కోవిడ్ పాజిటివ్ కేసులు
దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 1,04,50,284కు (Covid numbers in India) పెరిగాయి. కొత్త వైరస్ నుంచి 19,299 మంది కోలుకొగా.. ఇప్పటి వరకు 1,00,75,950 మంది డిశ్చార్జి అయ్యారు.
New Delhi, Jan 10: దేశంలో గడిచిన 24 గంటల్లో 18,645 కరోనా పాజిటివ్ కేసులు (New Covid numbers in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 1,04,50,284కు (Covid numbers in India) పెరిగాయి. కొత్త వైరస్ నుంచి 19,299 మంది కోలుకొగా.. ఇప్పటి వరకు 1,00,75,950 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 201 మంది మహమ్మారి ప్రభావంతో మృతి చెందగా.. 1,50,999కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,23,335 క్రియాశీల కేసులున్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. శనివారం ఒకే రోజు 8,43,307 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటి వరకు 18,10,96,622 నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 415 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,784 కి (Covid numbers in TS) చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,83,463 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,565 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,756 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,584 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 65 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,445 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 199 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,81,794 కి (Covid numbers in AP) చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.కోవిడ్ బారిన పడి గడచిన 24 గంటల్లో ఒక్కరు మరణించగా.. రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7128కి చేరింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 423 మంది కోవిడ్ కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,74,954 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 2,607 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 1,22,74,647 శాంపిల్స్‌ను పరీక్షించారు.