Wikipedia Top Search for 2023: వరల్డ్ కప్ గురించి తెగ సెర్చ్ చేసిన నెటిజన్లు, ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలేంటో తెలుసా? కోహ్లీ, షారుక్ వికీపీడియా పేజీలకు ఫుల్ డిమాండ్
ముఖ్యంగా వరల్డ్ కప్ (World Cup) గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు అత్యంత ఆసక్తి చూపించారు. దీంతో వికీపీడియాలో ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిలో క్రికెట్ మొదటి స్థానంలో ఉంది.
New Delhi, December 06: ఏ విషయం గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయాలని అనుకున్నా మనకు వెంటనే గుర్తొచ్చేది వికీపీడియా (Wikipedia Top Search for 2023). అలాంటి వికీపీడియాలో 2023 సంవత్సరంలో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలు ఏంటో తెలుసా? ఈ సంవత్సరం క్రికెట్ (Cricket) ఫీవర్ ప్రజల్ని ఊపేసింది. ముఖ్యంగా వరల్డ్ కప్ (World Cup) గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు అత్యంత ఆసక్తి చూపించారు. దీంతో వికీపీడియాలో ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిలో క్రికెట్ మొదటి స్థానంలో ఉంది. ఇంగ్లీష్ వికీపీడియాలో ఎక్కువగా శోధించినవాటిలో 16 శాతం క్రికెట్ ఆక్రమించింది. ఇంగ్లీష్ వికీపీడియా టాప్ 25 ఆర్టికల్స్ లో 16శాతం క్రికెట్ కు సంబంధించినవే ఉన్నట్లు ఓ రిపోర్డ్ తెలిపింది. ఈ సారి భారత్ లో క్రికెట్ వరల్డ్ కప్ జరిగిన సంగతి తెలిసిందే! దీంతో పాటూ ఐపీఎల్ గురించి కూడా ఈ సారి అత్యధికంగా సెర్చ్ చేశారు నెటిజన్లు.
వికీపీడియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన 25 ఆర్టికల్స్ లో టాప్ 6 ఆర్టికల్స్ వరల్డ్ కప్ కు సంబంధించినవే ఉన్నాయి. ఇక ఐపీఎల్ కు సంబంధించనవి మరో 9 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఏకంగా 116.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు 2023 క్రికెట్ వరల్డ్ కప్ కు సంబంధించిన వికీపీడియా పేజ్ కు గతంతో పోలిస్తే 304 శాతం అధికంగా వ్యూస్ వచ్చాయి. వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన కోహ్లీ గురించి తెలుసుకునేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పేజీకి ఏకంగా 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
కేవలం క్రికెట్ కు సంబంధించిన ఆర్టికల్స్ మాత్రమే కాదు బాలీవుడ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు చాలా ఆసక్తి చూపించారు. బాలీవుడ్ బాద్ షా నటించిన జవాన్, పఠాన్ మూవీస్ గురించి కూడా వికీపీడియాలో అత్జ్ఞధికంగా సెర్చ్ చేశారు నెటిజన్లు. ఈ పేజెస్ కు ఏకంగా 41.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలు రిలీజ్ అయిన రోజున అత్యధికంగా పేజ్ వ్యూస్ వచ్చాయని తెలిపింది. దీంతో పాటూ కరంట్ ఎఫైర్స్ కు సంబంధించిన వికీపీడియా పేజీలకు కూడా అత్యధిక వ్యూస్ వచ్చాయి. చంద్రయాన్ తో పాటూ, ఆస్కార్ సాధించిన నాటు నాటు పాట గురించి తెలుసుకునేందుకు వికీపీడియా ను ఆశ్రయించారు నెటిజన్లు. దీంతో పాటూ జీ-20కి ప్రాతినిధ్యం వహించిన భారత్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు.