Horoscope Today: ఈ రాశి వారికి పాత బాకీలు వసూలవుతాయి, ఆకస్మిక ధనలాభం వస్తుంది, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం

ఈ గ్రహ స్థానాల మధ్య ఈ రోజు రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో Today Horoscopeలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

(Photo Credits: Flickr)

ఈ రోజు అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశి వారిని వరిస్తుంది. ఈ గ్రహ స్థానాల మధ్య ఈ రోజు రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో Today Horoscopeలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. దూరప్రయాణాలు చేస్తారు.

వృషభం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విందువినోదాలు.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆలయాల సందర్శనం. విద్యార్థులకు ఒత్తిడులు.

కర్కాటకం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక.

కన్య: పనుల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. వాహనసౌఖ్యం. పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

తుల: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వస్తులాభాలు.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

ధనుస్సు: ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.

కుంభం: కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి.

మీనం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు.

నోట్: ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనికి లేటెస్ట్‌లీ ధృవీకరించలేదు. ఇది వాస్తవమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, ప్రజల విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif